Share News

ఘనంగా సహస్ర కలశాభిషేక పూజలు

ABN , Publish Date - Dec 17 , 2023 | 12:17 AM

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శనివారం గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో సహస్ర కలశాభిషేక పూజలను ఘనంగా నిర్వహించారు.

ఘనంగా సహస్ర కలశాభిషేక పూజలు
వేంకటేశ్వరస్వామి ఆలయంలో సహస్త్ర కలశాభిషేకం చేస్తున్న అహోబిల రామానుజ జీయర్‌స్వామి

సూర్యాపేట కల్చరల్‌, డిసెంబరు 16 : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శనివారం గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో సహస్ర కలశాభిషేక పూజలను ఘనంగా నిర్వహించారు. త్రిదండి అహోబిల రామానుజ జీయర్‌స్వామి వేయి కలశాలతో సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో స్వామివార్లకు సహస్త్ర కలశాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రామాయణం చదవాలని, దీంతో ప్రశాంతమైన ఉన్నత జీవితాన్ని పొందుతారన్నారు. భక్తవత్సలుడైన శ్రీమన్నారాయణస్వామి అనుగ్రహం పొందడానికి గోవిందమాల దీక్ష దారణ చేయాలన్నారు. అంతకుముందు దేవాలయ ప్రధాన అర్చకుడు నల్లాన్‌ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు వేకువజామునే స్వామి వారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించగా, గోవిందమాల మహా మండల పూజను ఘనంగా నిర్వహించారు. మహా మండల పూజకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. గోవింద నామ స్మరణలతో దేవాలయ ప్రాంగణం మార్మోగింది. అనంతరం దేవాలయ కమిటి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో పండితులు రఘుదత్తు ఆచార్యులు, హరిచరణ్‌ ఆచార్యులు, వంశీకృష్ణమాచార్యులు, సంకర్షణాచార్యులు, శ్రీహరి ఆచార్యులు, గోవిందమాల భక్తులు శ్రీనివాస్‌, నాగరాజు, రమేష్‌, బూర నాగరాజు, దంతాల చం ద్రశేఖర్‌, వెంకటచారి, వికాస తరంగిణి, ఆం డాళ్‌ గోష్టి భక్త బృందాలు, భక్తులు ఉన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 12:17 AM