సింగరేణి కార్మికులకు రూ.85 వేల దీపావళి బోనస్‌

ABN , First Publish Date - 2023-10-09T04:19:41+05:30 IST

బొగ్గుగని కార్మికులకు దీపావళి బోన్‌సను చెల్లించేందుకు కోల్‌ ఇండియా యాజమాన్యం అంగీకరించింది. ఢిల్లీలో ఆదివారం కోల్‌ ఇండియా యాజమాన్యం..

సింగరేణి కార్మికులకు రూ.85 వేల దీపావళి బోనస్‌

కొత్తగూడెం, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): బొగ్గుగని కార్మికులకు దీపావళి బోన్‌సను చెల్లించేందుకు కోల్‌ ఇండియా యాజమాన్యం అంగీకరించింది. ఢిల్లీలో ఆదివారం కోల్‌ ఇండియా యాజమాన్యం.. జాతీయ కార్మికసంఘాల మధ్య జరిగిన చర్చల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సింగరేణి కార్మికులకు రూ.85 వేల చొప్పున దీపావళి బోన్‌సను చెల్లించేందుకు అంగీకరించినట్లు సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. గత ఏడాది సింగరేణి కార్మికులకు రూ.76,500 బోనస్‌ చెల్లించగా ఈ ఏడాది దీపావళికి రూ.85 వేలు చెల్లించేందుకు కోల్‌ ఇండియా యాజమాన్యం అంగీకరించడం పట్ల హర్షం ప్రకటించారు. వర్కర్స్‌ యూనియన్‌ కార్మికుల హక్కుల కోసం నిరంతరం శ్రమిస్తోందని తెలిపారు.

Updated Date - 2023-10-09T04:19:41+05:30 IST