Richest City Hyderabad : భాగ్యనగరమే!
ABN , First Publish Date - 2023-04-20T02:27:44+05:30 IST
రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్.. ‘రిచెస్ట్ నగరి’ జిందాబాద్!! మట్టిలో మాణిక్యం సినిమాలోని పాటను ఇప్పుడిక ఇలాగ కూడా పాడుకోవచ్చేమో! ఎందుకంటే మన హైదరాబాద్ ప్రపంచంలోని ‘అత్యంత సంపన్న నగరాల్లో’
ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల్లో 65వ స్థానంలో హైదరాబాద్
97 నగరాలతో ‘హెన్లే అండ్ పార్ట్‌నర్స్’ సంస్థ జాబితా
భాగ్యనగరంలో గత పదేళ్లలో 78శాతం పెరిగిన మిలియనీర్లు
భారత్ నుంచి ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరుకూ చోటు
ఫస్ట్ న్యూయార్క్..
అమెరికాలోని న్యూయార్క్ సిటీకి ప్రపంచంలోనే అత్యంత సంపన్న
నగరంగా అగ్రస్థానం దక్కింది. హెన్లే అండ్ పార్ట్‌నర్స్ లెక్క ప్రకారం ఇక్కడ 3.4లక్షల మంది మిలియనీర్లు ఉన్నారు! 2000 సంవత్సరంలో
తొలి స్థానం పొందిన లండన్ నాలుగో స్థానానికి పడిపోయింది.
11,100
ఇది హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న మిలియనీర్ల సంఖ్య. 2012-2022 మధ్య భాగ్యనగరంలో ‘అపర కుబేరులు’ 78 శాతం పెరిగారు.
వాషింగ్టన్: రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్.. ‘రిచెస్ట్ నగరి’ జిందాబాద్!! మట్టిలో మాణిక్యం సినిమాలోని పాటను ఇప్పుడిక ఇలాగ కూడా పాడుకోవచ్చేమో! ఎందుకంటే మన హైదరాబాద్ ప్రపంచంలోని ‘అత్యంత సంపన్న నగరాల్లో’ ఒకటి! లండన్ కేంద్రంగా పనిచేసే ‘హెన్లే అండ్ పార్ట్‌నర్స్’ అనే సంస్థ విశ్వ వ్యాప్తంగా 97 నగరాలతో కూడిన ‘వరల్డ్ వెల్తియెస్ట్ సిటీస్ రిపోర్టు-2023’ను విడుదల చేసింది. ఈ జాబితాలో హైదరాబాద్‌కు 65వ స్థానాన్ని కట్టబెట్టింది! మరి.. ఈ ‘సంపన్న నగరాల’కు ప్రామాణికం ఏది? అంటే నగరాల్లోని మిలియనీర్ల లెక్కేనంటోంది ఆ సంస్థ! ‘మిలియనీర్లు’ అంటే ఒక మిలియన్ అమెరికన్ డాలర్లు, ఆపైన పెట్టుబడి పెట్టగల సామర్థ్యం గల కుబేరులు అని హెన్లే అండ్ పార్ట్‌నర్స్ నిర్వచించింది. ఈ స్థాయి సంపన్నులు ప్రపంచవ్యాప్తంగా 1.5 కోట్ల మంది ఉన్నారట! హైదరాబాద్‌లో 11,100 మిలియనీర్లు ఉన్నారని, గత పదేళ్లలో హైదరాబాద్‌లో మిలియనీర్లు 78శాతం పెరిగారని సర్వే సంస్థ పేర్కొనడం విశేషం. ఆఫ్రికా, ఆస్ట్రేలియా, తూర్పు, దక్షిణ, ఆగ్నేయాసియా, ఐరోపా, ఉత్తర అమెరికా దేశాల్లోని నగరాల్లో సర్వే చేసి జాబితా రూపొందించింది.
భారత్ నుంచి ఏయే నగరాలున్నాయ్?
మన దేశం నుంచి హైదరాబాద్‌తో సహా ఐదు నగరాలకు ‘రిచెస్’్ట సిటీస్ జాబితాలో చోటు దక్కింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై 21వ స్థానంలో నిలిచింది. ఢిల్లీ 36, బెంగళూరు 60, కోల్‌కతా 63 స్థానాల్లో నిలిచాయి.
టాప్‌టెన్ ఇవే
న్యూయార్క్ తర్వాత టోక్యో, శాన్‌ఫ్రాన్సిస్కో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. టోక్యోలో 2.90,300 మంది, శాన్‌ఫ్రాన్సిస్కోలో 2.85 లక్షల మంది మిలియనీర్లు ఉన్నారు. లండన్, సింగపూర్, లాస్ ఎంజిలెస్, హాంగ్‌కాంగ్, బీజింగ్, షాంఘై, సిడ్నీ తొలి పది స్థానాల్లో ఉన్నాయి