తిమ్మాపూర్‌ నిర్వాసితులకు పునరావాసం

ABN , First Publish Date - 2023-02-01T01:09:42+05:30 IST

భువనగిరి మండలం బీఎన్‌ తిమ్మాపూర్‌ నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, కలెక్టర్‌ పమేలాసత్పథి తెలిపారు. భువనగిరి మండలం హుస్నాబాద్‌లో సర్వే నెం.107లో నిర్వాసితుల కోసం కేటాయించిన లేఅవుట్‌లో విద్యుత్‌, నీరు, రోడ్ల కోసం పంచాయతీరాజ్‌, నీటి పారుదల, ఆర్‌డబ్ల్యూఎస్‌, విద్యుత్‌ శాఖ అధికారులతో మంగళవారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు.

తిమ్మాపూర్‌ నిర్వాసితులకు పునరావాసం

నేడు లాటరీ పద్ధతిన ఎంపిక

భువనగిరి ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి, కలెక్టర్‌

భువనగిరి అర్బన్‌, జనవరి31: భువనగిరి మండలం బీఎన్‌ తిమ్మాపూర్‌ నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, కలెక్టర్‌ పమేలాసత్పథి తెలిపారు. భువనగిరి మండలం హుస్నాబాద్‌లో సర్వే నెం.107లో నిర్వాసితుల కోసం కేటాయించిన లేఅవుట్‌లో విద్యుత్‌, నీరు, రోడ్ల కోసం పంచాయతీరాజ్‌, నీటి పారుదల, ఆర్‌డబ్ల్యూఎస్‌, విద్యుత్‌ శాఖ అధికారులతో మంగళవారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన విద్యుత్‌, నీటి వసతికో సం టెండర్‌ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నిర్వాసితులకు ప్రభుత్వం నుంచి ఇళ్లు, భూములకు రావాల్సిన పరిహారం త్వరలో మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలో భాగంగా ఒక్కొక్కరికి రూ.7.61లక్షల చొప్పున రూ.50కోట్లు అందజేసినట్లు తెలిపారు. హుస్నాబాద్‌ సర్వే నెం.107లో 200 గజాల ఇళ్ల స్థలాలను లాటరీ పద్ధతిలో బుధవారం కేటాయిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ దీపక్‌తివారీ, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ డి.శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో ఎంవీ భూపాల్‌రెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌ నాగిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-02-01T01:09:43+05:30 IST