అదే కమిషన్‌తో మళ్లీ పరీక్షలా:ప్రవీణ్‌కుమార్‌

ABN , First Publish Date - 2023-05-27T03:51:39+05:30 IST

ప్రభుత్వం, టీఎస్‌పీఎస్సీ బండారం బయటపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.

అదే కమిషన్‌తో మళ్లీ పరీక్షలా:ప్రవీణ్‌కుమార్‌

హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం, టీఎస్‌పీఎస్సీ బండారం బయటపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో గురువారం నాడు సిట్‌ మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేయడంపై ఆయన స్పందించారు. ఒకవైపు అరెస్టులు జరుగుతూనే ఉంటే మరోవైపు సిగ్గులేకుండా ప్రభుత్వం– టీఎస్‌పీఎస్సీలు కుమ్మక్కై అదే కమిషన్‌తో మళ్లీ పరీక్షలు నిర్వహిస్తున్నాయని ట్విటర్‌ వేదికగా ప్రవీణ్‌ కుమార్‌ ఽఘాటు వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-05-27T03:51:39+05:30 IST