5 వేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2023-08-09T04:08:07+05:30 IST

రెడ్డి సామాజిక వర్గాన్ని ఆదుకునేందుకు రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ ఏళ్లు గడుస్తున్నా అమలు కావడం లేదని రెడ్డి సంఘాల జేఏసీ ఆరోపించింది.

5 వేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి

సెప్టెంబరు 10న హైదరాబాద్‌ దిగ్బంధం: జేఏసీ

పంజాగుట్ట, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): రెడ్డి సామాజిక వర్గాన్ని ఆదుకునేందుకు రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ ఏళ్లు గడుస్తున్నా అమలు కావడం లేదని రెడ్డి సంఘాల జేఏసీ ఆరోపించింది. రూ.5 వేల కోట్లతో చట్టబద్ధతతో కూడిన రెడ్డి కార్పొరేషన్‌ను ఈ నెల 30 లోపు ఏర్పాటు చేయాలని జేఏసీ డిమాండ్‌ చేసింది. ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి సెప్టెంబరు 10న లక్షలాది మందితో హైదరాబాద్‌ను దిగ్బంధం చేస్తామని, భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని జేఏసీ అధ్యక్షుడు గోపు జైపాల్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జేఏసీ నేతలతో కలిసి ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ టి.జీవన్‌ రెడ్డి వ్యాఖ్యలు ఆయన అవివేకానికి నిదర్శనమని ఆయన అన్నారు.

Updated Date - 2023-08-09T04:08:07+05:30 IST