రంగారెడ్డి జిల్లా కలెక్టర్ బదిలీ!
ABN , Publish Date - Dec 25 , 2023 | 03:08 AM
రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్‌రెడ్డి సదస్సు ముగిసిన వెంటనే అధికారులను బదిలీ చేయడం గమనార్హం.
ఎన్నికల సమయంలో ఈసీ నియమించిన భారతికి స్థానభ్రంశం
రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీలు
హైదరాబాద్, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్‌రెడ్డి సదస్సు ముగిసిన వెంటనే అధికారులను బదిలీ చేయడం గమనార్హం. ఎన్నికలకు ముందు రంగారెడ్డి జిల్లా కల్టెర్‌గా నియమించిన భారతి హోలికేరిని బదిలీ చేశారు. ఆమెతో పాటు పలువురు ఐఏఎ్‌సలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా తప్పించిన భారతికి ప్రస్తుతం పోస్టింగ్ ఇవ్వలేదు. జీఏడీలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం మేడ్చల్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న గౌతమ్ పొత్రుకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు. ఎక్సైజ్ కమిషనర్‌గా పనిచేస్తున్న జ్యోతి బుద్ధప్రకాశ్‌ను రవాణ శాఖ కమిషనర్‌గా బదిలీ చేశారు.