హైకోర్టులో రాష్ట్ర పీపీగా రాజేందర్‌రెడ్డి
ABN , First Publish Date - 2023-09-07T03:59:35+05:30 IST
హైకోర్టులో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ)గా ఎం.రాజేందర్‌రెడ్డిని నియమిస్తూ బుధవారం ప్రభుత్వం జీవో విడుదల చేసింది. హైకోర్టుతో సంప్రదింపుల తర్వాత.. న్యాయవాది
హైదరాబాద్, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): హైకోర్టులో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ)గా ఎం.రాజేందర్‌రెడ్డిని నియమిస్తూ బుధవారం ప్రభుత్వం జీవో విడుదల చేసింది. హైకోర్టుతో సంప్రదింపుల తర్వాత.. న్యాయవాది రాజేందర్‌రెడ్డిని పీపీగా ఎంపిక చేసినట్లు.. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు లేదా మూడేళ్ల కాలపరిమితితో ఆయన పీపీగా కొనసాగుతారని న్యాయశాఖ కార్యదర్శి ఆ జీవోలో పేర్కొన్నారు. రాజేందర్‌రెడ్డి ఉమ్మడి ఏపీలో హైకోర్టు బార్‌కౌన్సిల్ చైర్మన్‌గా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన అడ్వొకేట్స్ జేఏసీ చైర్మన్‌గా కీలక పాత్ర పోషించారు.