పొంగులేటితో రాజగోపాల్‌రెడ్డి భేటీ?

ABN , First Publish Date - 2023-07-05T01:17:06+05:30 IST

రాహుల్‌గాంధీ సమక్షంలో రెండు రోజుల క్రితం కాంగ్రె్‌సలో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. అంతే వేగంగా ఆ పార్టీ రాజకీయాల్లో కీలకంగా మారిపోయారు. బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే

పొంగులేటితో రాజగోపాల్‌రెడ్డి భేటీ?

హైదరాబాద్‌, జూలై 4(ఆంధ్రజ్యోతి): రాహుల్‌గాంధీ సమక్షంలో రెండు రోజుల క్రితం కాంగ్రె్‌సలో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. అంతే వేగంగా ఆ పార్టీ రాజకీయాల్లో కీలకంగా మారిపోయారు. బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో మంగళవారం భేటీ అయి మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని పొంగులేటి నివాసంలో జరిగిన ఈ భేటీలో కీలక అంశాలపై వారు చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. కాంగ్రె్‌సనుంచి బీజేపీలో చేరిన రాజగోపాల్‌రెడ్డి.. కాషాయ పార్టీ అంతర్గత రాజకీయాల పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ఆయన తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరుకునే ప్రయత్నాల్లో ఉన్నారన్న ప్రచారమూ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పొంగులేటితో రాజగోపాల్‌రెడ్డి భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అయితే ఈ భేటీపై ఇరువురు నేతలూ ధ్రువీకరించలేదు.

Updated Date - 2023-07-05T01:17:06+05:30 IST