ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్‌ లింబాద్రి

ABN , First Publish Date - 2023-06-27T02:06:59+05:30 IST

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి పూర్తి స్థాయి చైర్మన్‌గా ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి నియమితులయ్యారు. అలాగే వైస్‌ చైర్మన్‌గా రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ ఎస్‌కే మహమ్మూద్‌ను నియమించారు.

ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్‌ లింబాద్రి

వైస్‌ చైర్మన్‌గా మహమూద్‌

మూడేళ్ల పాటు పదవుల్లో కొనసాగనున్న ఇరువురు

హైదరాబాద్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఉన్నత విద్యా మండలి పూర్తి స్థాయి చైర్మన్‌గా ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి నియమితులయ్యారు. అలాగే వైస్‌ చైర్మన్‌గా రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ ఎస్‌కే మహమ్మూద్‌ను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు. మూడేళ్ల పాటు వారు ఈ పదవుల్లో కొనసాగనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉన్నత విద్యా మండలి తొలి చైౖర్మన్‌గా ప్రొఫెసర్‌ పాపిరెడ్డి పనిచేసిన విషయం తెలిసిందే. అయితే... ఆయన పదవీ కాలం ముగిసిన తర్వాత అప్పటి వరకు వైస్‌ చైర్మన్‌గా ఉన్న లింబాద్రిని ఇన్‌చార్జి ఛైర్మన్‌గా నియమించారు. ఇప్పటి వరకు ఆయన ఇన్‌చార్జీగానే కొనసాగుతున్నారు. తాజాగా ఆయనను పూర్తిస్థాయి చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. లింబాద్రి చైౖర్మన్‌గా నియామకం కావడంతో ఖాళీ అయిన వైస్‌ చైౖర్మన్‌ పదవిలో రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ ఎస్‌కే మహమ్మూద్‌ను నియమించారు.

Updated Date - 2023-06-27T02:06:59+05:30 IST