తాగునీటి కష్టాలు పరిష్కరించాలి : జూలకంటి
ABN , First Publish Date - 2023-05-26T01:04:16+05:30 IST
వేసవిలో దాహార్తితో పలు కాలనీల ప్ర జలు అల్లాడుతున్నారని, వారి తాగునీటి కష్టాలు తీర్చాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు.

తాగునీటి కష్టాలు పరిష్కరించాలి : జూలకంటి
మిర్యాలగూడ, మే 25: వేసవిలో దాహార్తితో పలు కాలనీల ప్ర జలు అల్లాడుతున్నారని, వారి తాగునీటి కష్టాలు తీర్చాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఈదులగూడెం, ఏనేమీది కాలనీ ప్రజలు సీపీఎం ఆధ్వర్యంలో మునిసిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ శివారు కాలనీల్లో సుమారు 350 కుటుంబాల ప్రజలు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిషనభగీరథ పైపులైన్లు వేసి నల్లాలు బిగించినా ఇప్పటి వరకు తాగునీరు సరఫరా కాలేదని అన్నారు. స్లమ్ ఏరియాలో డ్రైనే జీ సౌకర్యం లేక మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తుందని, ఇళ్లలోకి దు ర్గంధం వ్యాపిస్తుందని అన్నారు. వారికి రేషనకార్డులు, పింఛన అంద డం లేదన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించకపోతే నిరవధిక ని రాహార దీక్ష చేపడతామని వారు హెచ్చరించారు. అనంతరం ముని సిపల్ కమిషనర్ రవీందర్‌సాగర్‌కు వినతిపత్రం అందజేశారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బీకార్ మల్లేష్, జిల్లా కమిటీ స భ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, జగదీష్‌చంద్ర, మూడావత రవినాయ క్, మల్లు గౌతంరెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, నాయకులు రెమిడాల పరుశ రాములు, బావండ్ల పాండు, తిరుపతి రాంమూర్త్తి, కౌన్సిలర్ ఘని, దేశీరామ్ నాయక్, మల్లయ్య, వినోద్‌నాయక్, బాబు నాయక్, వెంకట్‌రెడ్డి, రామారావు, పాపారావు, ఊర్మిల, ఫాతిమా పాల్గొన్నారు.