ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు నివారించాలి

ABN , First Publish Date - 2023-05-26T01:13:32+05:30 IST

జిల్లాలో ధాన్యం కొ నుగోళ్లలో సమస్యలు తలెత్తకుండా నివారించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ డీ.శ్రీనివా్‌సరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.

ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు నివారించాలి

భువనగిరి అర్బన్‌ / భూదాన్‌పోచంపల్లి, మే 25 : జిల్లాలో ధాన్యం కొ నుగోళ్లలో సమస్యలు తలెత్తకుండా నివారించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ డీ.శ్రీనివా్‌సరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రైస్‌మిల్లుల్లో ఎగుమతి, దిగుమతి సమస్య తలెత్తకుండా అధిక సంఖ్యలో హమాలీలను నియమించుకోవాలన్నా రు. మిల్లర్లు కొర్రీలు విధించకుండా తరుగు తీయకుండా జాప్యం చేయకుండా దిగుమతిలో ఎలాంటి అవకతవకలు జరగకుండా యంత్రాంగానికి సహకరించాలన్నారు. కాంటా వేసిన ధాన్యం వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల ని, సకాలంలో మద్దతు ధరతో రైతులకు డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. 325 కొనుగోలు కేంద్రాల ద్వారా 2,37,292 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలుచేసి మిల్లులకు తరలించామన్నారు. సమావేశంలో పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీనివా్‌సరెడ్డి, మేనేజర్‌ గోపీకృష్ణ, అధికారులు పాల్గొన్నారు.

కొనుగోళ్లను వేగవంతం చేయాలి

భూదాన్‌పోచంపల్లి: ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి ఆదేశించారు. గురువారం మండలంలోని గౌసుకొండ ఐకేపీ కేంద్రంలో కొనుగోలు ప్రక్రియ తీరును పరిశీలించారు. అనంతరం పట్టణంలోని విజయదుర్గ, లక్ష్మీనర్సింహ రైస్‌మిల్లులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో రైసుమిల్లు యజమానులు తరుగు పేరిట రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆయన వెంట తహసీల్దార్‌ బీ వీరాబాయి, ఎంఆర్‌ఐ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-26T01:13:32+05:30 IST