ప్రజా పంథా కార్యదర్శిగా పోటు రంగారావు

ABN , First Publish Date - 2023-05-26T04:09:04+05:30 IST

సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శిగా పోటు రంగారావు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఖమ్మంలో ఈ నెల 22, 23, 24

ప్రజా పంథా కార్యదర్శిగా పోటు రంగారావు

ఖమ్మం సంక్షేమ విభాగం, మే 25 : సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శిగా పోటు రంగారావు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఖమ్మంలో ఈ నెల 22, 23, 24 తేదీల్లో జరిగిన రాష్ట్ర మహా సభలలో 29 మందితో రాష్ట్ర కొత్త కమిటీని ఎన్నుకున్నారు. గురువారం ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో పోటు రంగారావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడి పదేళ్లయినా ప్రజా సమస్యలు పరిష్కారం కాలేదని, అందుకే జూన్‌ 2 నుంచి 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్‌ నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

Updated Date - 2023-05-26T04:09:04+05:30 IST