గారడి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి: పొంగులేటి

ABN , First Publish Date - 2023-03-05T03:05:08+05:30 IST

రాష్ట్రంలో మాటలే తప్ప చేతల్లేని బీఆర్‌ఎస్‌ గారడి ప్రభుత్వానికి బుద్ది చెప్పే సమయం ఆసన్నమయిందని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.

గారడి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి: పొంగులేటి

బయ్యారం, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మాటలే తప్ప చేతల్లేని బీఆర్‌ఎస్‌ గారడి ప్రభుత్వానికి బుద్ది చెప్పే సమయం ఆసన్నమయిందని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని బస్టాండ్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయాన్ని శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కోరం కనకయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ... విద్యార్థులు, యువకుల ఆత్మ బలిదానాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పాలన ఏ మేరకు నడుస్తుందో ప్రజలకు తెలుసన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలకు భిన్నంగా రాష్ట్రంలో పాలన కొనసాగుతుందని విమర్శించారు.

Updated Date - 2023-03-05T03:05:08+05:30 IST