నేడు రాహుల్‌తో పొంగులేటి భేటీ
ABN , First Publish Date - 2023-06-26T03:12:04+05:30 IST
కాంగ్రె్‌సలో చేరాలని నిర్ణయించుకున్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అనుచరులతో కలిసి ఆదివారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు.....
జూపల్లి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల, గుర్నాథరెడ్డి కూడా
బీఆర్‌ఎస్‌ను కలిసికట్టుగా గద్దె దింపుతాం
ఖమ్మం సభలో కాంగ్రెస్‌లో చేరతా: పొంగులేటి
హైదరాబాద్/ఖమ్మం/న్యూఢిల్లీ, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): కాంగ్రె్‌సలో చేరాలని నిర్ణయించుకున్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అనుచరులతో కలిసి ఆదివారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. సోమవారం ఉదయం ఆయన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డితో కలిసి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీలను కలుసుకోనున్నారు. వీరితోపాటు మరో 40 మంది అనుచరులు కూడా వారిని కలవనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రాహుల్‌తో జరిగే ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, మహేశ్‌కుమార్‌గౌడ్, హర్కార వేణుగోపాల్ తదితరులు పాల్గొననున్నారు. కాగా, పీపుల్స్ మార్చ్ పేరుతో సీఎల్పీ నేత భట్టివిక్రమార్క చేపట్టిన పాదయాత్ర ఖమ్మంలో ముగియనున్న నేపథ్యంలో.. ముగింపు సభలో రాహుల్‌గాంధీ పాల్గొననున్నారు. ఈ సభను జూలై 2, 3 తేదీల్లో ఏ రోజు నిర్వహించాలన్నది ఈ భేటీలో ఖరారు కానుంది. తాను ఖమ్మంలో నిర్వహించనున్న సభలో కాంగ్రెస్ పెద్దల సమక్షంలో ఆ పార్టీలో చేరతానని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తనతోపాటు ముఖ్యమైన నేతలు, తన అనుచరులంతా చేరతారని చెప్పారు. ఆదివారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న సందర్భంగా విమానాశ్రయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నది తెలంగాణ బిడ్డలు కోరుకున్న ప్రభుత్వం కాదన్నారు. బీఆర్‌ఎస్ సర్కారును కలిసికట్టుగా గద్దె దింపుతామని ప్రకటించారు. ఖర్గే, రాహుల్‌లతో భేటీ అనతరం భవిష్యత్తు కార్యాచరణను విలేకరుల సమావేశంలో వెల్లడిస్తానని చెప్పారు. తన నిర్ణయం వెనుకున్న కారణాలనూ వివరిస్తానన్నారు.
పొంగులేటి అనుచరులపై పాతకేసులు తెరపైకి
పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రె్‌సలో చేరనున్న నేపథ్యంలో.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆయన ముఖ్య అనుచరులపై ఉన్న పాతకేసులను పోలీసులు తెరపైకి తెచ్చారు. డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, ఖమ్మం డీసీసీబీ ప్రస్తుత డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య పై ఉన్న పాత కేసుల ఆధారంగా వారిని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. విజయ్‌బాబు ఖమ్మం డీసీసీబీ చైర్మన్‌గా ఉన్న సమయంలో ఆ పాలకవర్గం అక్రమాలకు పాల్పడిందని గతంలో కేసులు నమోదయ్యా యి. అయితే ఆ కేసుల విషయంలో విజయ్‌బాబు కోర్టు నుంచి స్టే తెచ్చుకోవడంతోపాటు ఆయన అప్పు డు అధికార బీఆర్‌ఎ్‌సలో ఉండడంతో కేసులను ఎవరూ పట్టించుకోలేదు. మరోవైపు అశ్వాపురం సహకార సంఘం చైర్మన్, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మ య్య, ఆయన సోదరుడు రమే్‌షపై గతేడాది జూన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఆయన ఇంతకాలం బీఆర్‌ఎ్‌సలో ఉన్నందున ఆ కేసును పెండింగ్‌లో ఉంది. శనివారం బ్రహ్మయ్య సోదరుడు తుళ్లూరి రమే్‌షను పోలీసులు అరెస్టు చేశారు. విజయ్‌బాబు, బ్రహ్మయ్య సెల్‌ఫోన్లు స్విచా్‌ఫలో ఉన్నాయి.