చెరువులను త్వరితగతిన నింపాలి : రవీంద్ర

ABN , First Publish Date - 2023-05-26T01:06:34+05:30 IST

ఉమ్మడి చందంపే ట మండలంలోని చెరువులను, కుంటలను త్వరితగతిన నింపాలని ఎ మ్మెల్యే రమావత రవీంద్రకుమార్‌ అధికారులను ఆదేశించారు.

 చెరువులను త్వరితగతిన నింపాలి : రవీంద్ర
బడసాయబ్‌కుంటను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే రవీంద్ర

చెరువులను త్వరితగతిన నింపాలి : రవీంద్ర

చందంపేట, మే 25: ఉమ్మడి చందంపే ట మండలంలోని చెరువులను, కుంటలను త్వరితగతిన నింపాలని ఎ మ్మెల్యే రమావత రవీంద్రకుమార్‌ అధికారులను ఆదేశించారు. గురువారం మండలంలోని పోలేపల్లిలోని బడసాయబ్‌కుంట, చందంపేటలోని కుంటలను ఆయన పరిశీలించారు. మండు వేసవిలో డిండి ప్రాజెక్టు నీటి ద్వారా చం దంపేట మండలంలోని అన్ని చెరువులను, కుంటలను నింపి ప్రజలకు సాగు, తాగునీటికి సరఫరా చేసి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సర్వయ్య, బోయపల్లి శ్రీనివాస్‌గౌడ్‌, రాజవర్ధనరెడ్డి, అనంతగిరి పాల్గొన్నారు. అనంతరం చందంపేట మండలంలోని కొరుట్ల గ్రామంలో జరిగిన బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పండగలు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని అన్నారు. ప్రజలందరూ పండగలను ఆనందోత్సవాలతో నిర్వహించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ దొండేటి మల్లారెడ్డి, రామ కృష్ణ, బీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-26T01:06:34+05:30 IST