Share News

కబ్జాదారుల నుంచి ప్లాట్లను రక్షించాలి

ABN , Publish Date - Dec 17 , 2023 | 11:11 PM

రోడ్లను మూసివేసి తమ వెంచర్‌లోకి రాకుండా ప్లాట్లను కబ్జా చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని బింగి యాదమ్మ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నిర్వాహకులు అన్నారు.

కబ్జాదారుల నుంచి ప్లాట్లను రక్షించాలి

ఘట్‌కేసర్‌, డిసెంబర్‌ 17 : రోడ్లను మూసివేసి తమ వెంచర్‌లోకి రాకుండా ప్లాట్లను కబ్జా చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని బింగి యాదమ్మ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నిర్వాహకులు అన్నారు. ఆదివారం ఘట్‌కేసర్‌ మండల పరిధిలోని చౌదరిగూడ పంచాయతీ అనుబంధ గ్రామమైన మక్తలో సర్వే నంబర్‌ 715లో గల ప్లాట్లను కబ్జా చేసేందుకు మాజీ సర్పంచ్‌ భర్త నర్సింహ, అతని అనుచరులు యత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వెంచర్లోకి వెళ్లకుండా రోడ్లను మూసి వేసి బెదింరింపులకు గురి చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గుర్తు చేశారు. ఐనప్పటికీ సమస్యలు తప్పటం లేదని ఆరోపించారు. ఇకనైనా అధికారులు స్పందించి ప్లాట్ల కబ్జాకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు.

Updated Date - Dec 17 , 2023 | 11:11 PM