Share News

చెంచుల జీవనోపాధి, వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలి

ABN , Publish Date - Dec 23 , 2023 | 11:53 PM

చెంచుల జీవనోపాధి, వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి, ఆమనగల్‌, కడ్తాల్‌ మండలాలకు సంబంధించిన ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, సంబంధిత అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.

చెంచుల జీవనోపాధి, వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలి

జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

రంగారెడ్డి అర్బన్‌, డిసెంబర్‌ 23 : చెంచుల జీవనోపాధి, వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి, ఆమనగల్‌, కడ్తాల్‌ మండలాలకు సంబంధించిన ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, సంబంధిత అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రధానమంత్రి జనజాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్‌ (పీఎం జన్‌మన్‌) పథకం ద్వారా ఆమనగల్‌, కడ్తాల్‌ మండలాలో నివాసముంటున్న చెంచులకు చేకూరేలా జీవన స్థితిగతుల పూర్తిస్థాయి వివరాలను సమర్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. పీవీటీపీల కుటుంబాలు, ఆవాసాలను రహదా రులు, టెలి కమ్యూనికేషన్లు, విద్యుత్‌, సురక్షిత గృహాలు వంటి ప్రాథమిక సౌకర్యాలతో అనుసంధానించే ప్రణాళిక రూపొందించాలన్నారు. ముఖ్యంగా చెంచు ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు, పారిశుధ్యం, విద్య, ఆరోగ్యం, పోషణల మెరుగైన లభ్యత సహా సుస్థిర జీవనోపాధి అవకాశాలు కల్పించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. పీఎం జన్‌మన్‌ పథకం గురించి గ్రామసభలు నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు. చెంచు ప్రజల ఆరోగ్యం, రక్తహీనత వ్యాధి నిర్మూలన, క్షయ నిర్మూలన, వందశాతం రోగ నిరోధక టీకాలు, పీఎం సురక్షిత మాతృత్వ యోజన, పీఎం మాతృ వందన యోజన, పీఎం పోషణ్‌, పీఎం జన్‌ధన్‌ యోజన తదితరాలన్నీ సంతృప్త స్థాయిలో అమలయ్యేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారి రామేశ్వరీ దేవి, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ప్రభాకర్‌, ఆమనగల్‌, కడ్తాల్‌ మండలాల ఎంపీడీవోలు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2023 | 11:53 PM