పులులపై అవగాహనకు ఫొటో ఎగ్జిబిషన్‌

ABN , First Publish Date - 2023-06-11T03:07:40+05:30 IST

పులుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు టీఎస్‌ఆర్టీసీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఫొటోగ్రఫీ ద్వారా జీవవైవిధ్యంలో పులుల ప్రాముఖ్యతను వివరించేందుకు దేశంలోనే తొలిసారిగా

పులులపై అవగాహనకు ఫొటో ఎగ్జిబిషన్‌

దేశంలోనే తొలిసారిగా టీఎస్‌ఆర్టీసీ వినూత్న కార్యక్రమం

హైదరాబాద్‌, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): పులుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు టీఎస్‌ఆర్టీసీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఫొటోగ్రఫీ ద్వారా జీవవైవిధ్యంలో పులుల ప్రాముఖ్యతను వివరించేందుకు దేశంలోనే తొలిసారిగా ‘హైదరాబాద్‌ ఆన్‌ వీల్స్‌’ బస్సులో టైగర్‌ ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఎగ్జిబిషన్‌లో ఐసీబీఎం–స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఎక్స్‌లెన్స్‌ డీన్‌(అకడమిక్స్‌), వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ ప్రొఫెసర్‌ జితేందర్‌ గొవిందాని తీసిన పులుల ఫొటోలను టీఎస్‌ఆర్టీసీ ప్రదర్శిస్తోంది. శుక్రవారం హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్క్‌ ప్రాంగణంలో ఆన్‌ వీల్స్‌ బస్సులో టైగర్‌ ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌(పీసీసీఎఫ్‌) రాకేశ్‌ మోహన్‌ డోబ్రియాల్‌, టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ ప్రారంభించారు. హైదరాబాద్‌ ఆన్‌ వీల్స్‌ బస్సులో టైగర్‌ ఫొటో ఎగ్జిబిషన్‌ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ఐపీఎఫ్‌ వ్యవస్థాపకుడు ఆక్విన్‌ మాథ్యూస్‌ అన్నారు.

Updated Date - 2023-06-11T03:07:40+05:30 IST