‘ప్రజా పాలన’ను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Dec 29 , 2023 | 12:03 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఎస్ వెంకటరావు అన్నారు.
సూర్యాపేట(కలెక్టరేట్), డిసెంబరు 28 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఎస్ వెంకటరావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని 17వ వార్డు చింతలచెర్వులో ఏర్పాటుచేసిన ప్రజాపాలన సభను ప్రారంభించి, మాట్లాడారు. ప్రజా పాలనలో మహాలక్ష్మి, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, చేయూత పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. పేదలకు వరం అభయహస్తం పథకాలని అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామన్నారు. ప్రజాపాలన సభల్లో దరఖాస్తు ఇవ్వకపోయిన వారు పంచాయతీ, మునిసిపాలిటీ కార్యాలయాల్లో అందజేసి రశీదులు పొందాలన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెలా మహిళలకు రూ.2500, అదేవిధంగా గ్యాస్ సిలిండర్‌ను రూ.500కు అందజేయనున్నట్లు స్పష్టం చేశారు. రైతు భరోసా పథకం ద్వారా రైతులు, కౌలు రైతులకు ఏడాదికి ఎకరానికి రూ.15 వేలు అందించనున్నట్లు వివరించారు. గృహజ్యోతి పథకం ద్వారా ప్రతి నెలా కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత, చేయూత పథకం ద్వారా వృద్ధులకు నెలకు రూ.4వేల పింఛన, దివ్యాంగులకు రూ.6వేల పింఛన అందించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని గ్రామపంచాయతీలు, మునిసిపాలిటీలు కలిపి మొత్తం 58 బృందాలను ఏర్పాటు చేసి 3,425 కేంద్రాల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మేక నాగేశ్వర్‌రావు, మునిసిపల్ చైర్‌పర్సన పెరుమాళ్ల అన్నపూర్ణ, జడ్పీ సీఈవో సురేష్, కమిషనర్ పీ రామాంజులరెడ్డి, మెప్మా పీడీ రమే్‌షనాయక్, డీసీఆర్‌బీ డీఎస్పీ జీ రవి, కౌన్సిలర్ చింతలపాటి భరతమహాజన పాల్గొన్నారు.
ప్రజల వద్దకు పాలనను తెచ్చేందుకే
తిరుమలగిరి రూరల్, డిసెంబరు 28 : ప్రజల వద్దకు పరిపాలన చేరాలన్న ఉద్దేశంతోనే ప్రజాపాలన కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. ప్రజా పాలన కార్యక్రమాన్ని మండలంలోని బండ్లపల్లి గ్రామంలో కలెక్టర్ వెంకటరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాపాలన అందించాలనే సంకల్పంతో ప్రజలకు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక నెరవేస్తుందన్నారు. గ్రామాల్లో 100 కుటుంబాలకు ఒక అధికారిని నియమించామని, ఎనిమిది రోజుల వరకు ఈ సభల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఎస్సారెస్పీ నీటి విడుదలపై ఎమ్మెల్యేను కోరగా ఆయన ఎస్సారెస్పీ సీఈతో మాట్లాడి జనవరి 8 నుంచి నీరు ఇస్తామని చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ సుందరి కిరణ్‌కుమార్, తహసీల్దార్ రమణారెడ్డి, ఎంపీపీ స్నేహలత,సర్పంచ సోమలక్ష్మి, ఎంపీటీసీ జుమిలాల్, కాంగ్రెస్ నాయకులు నరేష్, జనార్ధన, శ్రీను, లక్ష్మయ్య, కిష్టునాయక్ పాల్గొన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో దరఖాస్తులను ప్రజలకు అందజేశారు. దరకాస్త్తులను జనవరి 6వ తేదీ లోగా గ్రామాల్లో ఏర్పాటుచేసిన కౌంటర్లో ఇవ్వవచ్చని అధికారులు తెలిపారు.