ప్రజలు బహుజన రాజ్యాన్ని కోరుకుంటున్నారు

ABN , First Publish Date - 2023-09-18T04:54:05+05:30 IST

రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని, సీఎం కేసీఆర్‌ నియంత పోకడలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.

ప్రజలు బహుజన రాజ్యాన్ని కోరుకుంటున్నారు

రాష్ట్రంలో రాక్షస పాలన:ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

కూసుమంచి, సెప్టెంబరు 17: రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని, సీఎం కేసీఆర్‌ నియంత పోకడలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. కేసీఆర్‌ కుటుంబపాలనకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు బహుజన రాజ్యాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. ఆదివారం ఖమ్మం జిల్లా కూసుమంచికి వచ్చిన ఆయన మీడియా సమావేశంలో, తర్వాత నియోజకవర్గ ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. అభివృద్ధి, ప్రాజెక్టుల పేరుతో పాలకులు కోట్లు దండుకుంటున్నారని ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. రాష్ట్రం అవినీతిలో ముందంజలో, అభివృద్ధిలో వెనుకంజలో ఉందని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో మైనింగ్‌ మాఫియా పెద్దఎత్తున నడుస్తోందని, సీఎం కేసీఆర్‌ అండతో మంత్రి పువ్వాడ అజయ్‌ అక్రమ మైనింగ్‌, గ్రానైట్‌, ఇసుక, మట్టి తవ్వకాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ, జైలుకు పంపుతున్నారని తెలిపారు.

Updated Date - 2023-09-18T04:54:05+05:30 IST