Kumaram Bheem Asifabad- ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ABN , Publish Date - Dec 30 , 2023 | 10:04 PM
ఆరు గ్యారెంటీల పథకాల కోసం ప్రజలు అందించే దరఖాస్తుల స్వీకరణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాపాలన ప్రత్యేకాధకారి ఎం ప్రశాంతి అన్నారు.
ఆసిఫాబాద్‌రూరల్/కెరమెరి, డిసెంబరు 30: ఆరు గ్యారెంటీల పథకాల కోసం ప్రజలు అందించే దరఖాస్తుల స్వీకరణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాపాలన ప్రత్యేకాధకారి ఎం ప్రశాంతి అన్నారు. జిల్లాలోని కెరమెరి మండలం మోడి, ఆసిఫాబాద్ మండలం అడ, ఆసిఫాబాద్ గ్రామ పంచాయతీలలో కొనసాగుతున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని శనివారం కలెక్టర్ హేమంత్ బోర్కడే, అదనపు కలెక్టర్ దీపక్‌తివారితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరు గ్యారంటీల ఫలాలను అందించేందుకు గ్రామపంచాయతీల, మున్సిపాలిటీల వారీగా దరఖాస్తులు తీసుకుంటున్నామని చెప్పారు. జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించనున్నామని, ప్రజలు ముందస్తుగానే తమ దరఖాస్తులను నింపి ఆయా కౌంటర్లలో అందజేయాలని సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 365 గ్రామపంచాయతీలు, ఒక మున్సిపాలిటీ ఉన్నాయని చెప్పారు. దరఖాస్తుల స్వీకరణకు 1.335 కౌంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ఉమర్‌హుస్సేన్, జడ్పీటీసీ దృపతాబాయి, ఎంపీడీవో మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తుల కార్యక్రమాన్ని పకడ్బంధీగా చేపట్టాలని ఎంపీపీ మల్లికార్జున్ అన్నారు. శనివారం మండలంలోని చోర్‌పల్లి, గుండి, తుంపల్లి గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ అలీబీన్ అహ్మద్, డీటీ పోచయ్య, ఎంపీడీవొ శశికళ, ఎంపీవో ప్రసాద్, ఏపీవో చంద్రశేఖర్, ఎంపీటీసీలు, కార్యదర్శులు పాల్గొన్నారు.
వాంకిడి: ప్రజాపాలన గ్రామసభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవవాలని తహసీల్దార్ రహీముద్దీన్, ఎంపీడీవో శివకుమార్‌లు కోరారు. మండలంలోని లక్ష్మీపూర్, వెలిగి, సోనాపూర్, సవ్వాతి గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏవో మిలింథ్‌కుమార్, డీఈ ఇర్ఫాన్, ఏపీవో శ్రావణ్, అధికారులు సౌమ్య, గణపతి తదితరులు పాల్గొన్నారు.
చింతలమానేపల్లి: ప్రజాపాలన దరఖాస్తుల కార్యక్రమాన్ని పకడ్బంధీగా చేపట్టాలని ఎంపీపీ నానయ్య, తహసీల్దార్ నాగరాజుగౌడ్‌లు అన్నారు. శనివారం మండలంలోని కర్జవెల్లి గ్రామంలో గ్రామ సభలో పాల్గొని దరఖాస్తులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, సర్పంచ్ నానయ్య, కార్యదర్శి ఇస్తారి తదితరులు పాల్గొన్నారు.
కౌటాల: మండలంలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. శనివారం ఎంపీపీ విశ్వనాథ్, తసీల్దార్ శ్రీపాల్‌రెడ్డి, ఎంపీడీఓ నస్రూల్లాఖాన్‌లు, ప్రత్యేకాధికారులు దరఖాస్తులను స్వీకరించారు. అయిదు గ్యారంటీలకు ఒకే దరఖాస్తు ఉన్నందున సక్రమంగా నింపాలన్నారు. కన్కీలో ఏఓ రాజేష్ దరఖాస్తులను స్వీకరించారు.