దైవచింతనతో మానసిక ప్రశాంతత

ABN , First Publish Date - 2023-01-15T00:26:00+05:30 IST

దైవచింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని శాసనమండలి చైర్మన గుత్తా సు ఖేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు రమావత రవీంద్రకుమార్‌ అన్నారు.

 దైవచింతనతో మానసిక ప్రశాంతత
ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌

దైవచింతనతో మానసిక ప్రశాంతత

దేవరకొండ, చిట్యాలరూర ల్‌, జనవరి 14: దైవచింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని శాసనమండలి చైర్మన గుత్తా సు ఖేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు రమావత రవీంద్రకుమార్‌ అన్నారు. శనివారం పట్టణంలోని గరుడాద్రి వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింత న కలిగి ఉండాలని అన్నారు. అనంతరం ఆలయ కమిటీ నిర్వాహకులు సుఖేందర్‌రెడ్డి, ఎమ్మె ల్యే రవీంద్రకుమార్‌ను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆలయకమిటీ అధ్యక్షుడు ఆలంపల్లి నర్సింహ, ఎంపీపీ జానయాదవ్‌, సునీతజనార్ధనరావు, కృష్ణయ్య, వడ్త్య దేవేందర్‌నాయక్‌, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఫ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు భరోసా కల్పిస్తుందని శాసనమండలి చైర్మన సుఖేందర్‌రెడ్డి అన్నారు. చిట్యాల మండలం ఉరుమడ్లలో శనివారం సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేసి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సీఎం రిలీ్‌ఫఫండ్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Updated Date - 2023-01-15T00:26:02+05:30 IST