19న హరితోత్సవం అధికారులతో పీసీసీఎఫ్‌ వీడియో కాన్ఫరెన్స్‌

ABN , First Publish Date - 2023-06-11T03:26:27+05:30 IST

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 19న రాష్ట్రవ్యాప్తంగా అటవీ శాఖ తరఫున హరితోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్టు అటవీ సంరక్షణ ప్రధాన

19న హరితోత్సవం అధికారులతో పీసీసీఎఫ్‌ వీడియో కాన్ఫరెన్స్‌

హైదరాబాద్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 19న రాష్ట్రవ్యాప్తంగా అటవీ శాఖ తరఫున హరితోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్టు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్‌.ఎం. డోబ్రియాల్‌ తెలిపారు. ఇందుకు ఏర్పాట్లపై శనివారం సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. అన్ని జిల్లాల అటవీ అధికారులతో పీసీసీఎఫ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. 19న రాష్ట్రంలోని అన్ని నేషనల్‌, అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులు, జూపార్కుల్లో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు పీసీసీఎఫ్‌ తెలిపారు.

Updated Date - 2023-06-11T03:26:27+05:30 IST