ట్యాంక్‌బండ్‌పై పాపన్నగౌడ్‌ విగ్రహం

ABN , First Publish Date - 2023-08-18T04:55:08+05:30 IST

హైదరాబాద్‌లోని ట్యాంక్‌ బండ్‌పై త్వరలో సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడల శాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ చెప్పారు.

ట్యాంక్‌బండ్‌పై పాపన్నగౌడ్‌ విగ్రహం

కోట్‌పల్లిని టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దుతాం: శ్రీనివాస్‌గౌడ్‌

చేవెళ్ల, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి)/తాండూరు: హైదరాబాద్‌లోని ట్యాంక్‌ బండ్‌పై త్వరలో సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడల శాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ చెప్పారు. గురువారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో, వికారాబాద్‌ జిల్లా తాండూరులో నూతనంగా ఏర్పాటు చేసిన పాపన్నగౌడ్‌ విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ వీరత్వానికి ప్రతీక పాపన్నగౌడ్‌ అని అన్నారు. జమీందార్లు, జాగిర్దార్ల అరాచకాలను సహించలేక కడుపు మండి కత్తి పట్టిన వీరుడు అని కొనియాడారు. దళిత, బహుజనులు ఏకమై పోరాడితేనే రాజ్యాధికారం సాధించవచ్చని నిరూపించిన సామాన్యుడు అని చెప్పారు. కోట్‌పల్లి నీటిపారుదల ప్రాజెక్టు ప్రాంతాన్ని టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. తాండూరులో ఎక్సైజ్‌ భవనాన్ని నిర్మిస్తామని ఆయన తెలిపారు.

Updated Date - 2023-08-18T04:55:08+05:30 IST