నల్లగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మనగా పంకజ్ యాదవ్
ABN , First Publish Date - 2023-05-02T00:23:32+05:30 IST
నల్లగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మనగా బీఆర్‌ఎస్ సీ నియర్ నాయకుడు చీర పంకజ్‌యాదవ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
నల్లగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మనగా పంకజ్ యాదవ్
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
నల్లగొండ, మే 1: నల్లగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మనగా బీఆర్‌ఎస్ సీ నియర్ నాయకుడు చీర పంకజ్‌యాదవ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైస్ చైర్మనగా దొంతం ఇంద్రసేనారెడ్డి, కమిటీ సభ్యులుగా కందికొండ జానయ్య, చింతకింది శంకరయ్య, ఇస్తావత హన్మంతు, దేప అమృతారెడ్డి, పనస శ్రీనివాస్, రొయ్య సైదులు, మల్లెబోయిన బుచ్చిరాజు, కొండ్ర స్వరూప, గడగోజు సత్యనారాయణలను నియమించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నల్లగొండ మార్కెట్ కమిటీ చైర్మన, వైస్ చైర్మన కమిటీ సభ్యులు త్వరలో పదవి బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి తెలిపారు.