ఇంటిగ్రేటెడ్‌ అంబుడ్స్‌మెన్‌కు 2022-23లో 7 లక్షలకు పైగా ఫిర్యాదులు

ABN , First Publish Date - 2023-09-22T02:45:59+05:30 IST

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) తీసుకొచ్చిన ఇంటిగ్రేటెడ్‌ అంబుడ్స్‌మెన్‌ స్కీమ్‌ కింద తమ సమస్యల పరిష్కారం కోసం వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

ఇంటిగ్రేటెడ్‌ అంబుడ్స్‌మెన్‌కు 2022-23లో  7 లక్షలకు పైగా  ఫిర్యాదులు

వాటిలో 97.99 శాతం పరిష్కారం

ఆర్బీఐ ఉన్నతాధికారుల వెల్లడి

(ముంబై నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) తీసుకొచ్చిన ఇంటిగ్రేటెడ్‌ అంబుడ్స్‌మెన్‌ స్కీమ్‌ కింద తమ సమస్యల పరిష్కారం కోసం వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తున్నట్టు ముంబైలోని ఆర్బీఐ ప్రధాన కార్యాలయ ఉన్నతాధికారులు తెలిపారు. వినియోగదారుల్లో అవగాహన పెరుగుతుండటం వల్ల ఫిర్యాదులు ఎక్కువగా అందుతున్నట్టు పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్‌ అంబుడ్స్‌మెన్‌ పథకం 2021 నవంబరు నుంచి అమల్లోకి వచ్చింది. ఇక 2021-22లో 4,18,189 ఫిర్యాదులు రాగా వాటిలో 97.97 శాతం పరిష్కారమయ్యా యి. 2022-23లో ఏకంగా 7,03,544 ఫిర్యాదులు రాగా 97.99 శాతం పరిష్కరించినట్టు అధికారులు తెలిపారు. బ్యాంకింగ్‌, ఎన్‌బీఎ్‌ఫసీ, డిజిటల్‌ లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం ఇంతకు ముందు 3 వేర్వేరు అంబుడ్స్‌మెన్‌ పథకాలున్నాయి. వీటిని ‘ఒకే దేశం, ఒకే అంబుడ్స్‌మన్‌’ పేరుతో ఇంటిగ్రేటెడ్‌ అంబుడ్స్‌మన్‌ పథకంతో కలిపారు. టోల్‌ఫ్రీ నం.14448 కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసే అవకాశం కల్పించా రు. హిందీ, ఇంగ్లి్‌షతోపాటు మరో 9 ప్రాంతీయ భాషల్లో (తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, గుజరాతి, పంజాబీ, ఒడిషా, బెంగాలి, మరాఠీ) బాఽధితులు ఫిర్యాదు చేయవచ్చు. ఈ పథకం ద్వారా ఉచితంగా సేవలు పొందవచ్చు. బాధితులు సమస్యలపై ముందుగా సంబంధిత బ్యాంక్‌, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలను సంప్రదించాలి. ఇచ్చిన ఫిర్యాదును ఆయా సంస్థలు పరిష్కరించకపోతే నెల నుంచి ఏడాదిలోపు అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. బాధితులు ఇబ్బందులు కలిగించిన బ్యాంక్‌, ఎన్‌బీఎ్‌ఫసీ వివరాలు, కలిగిన నష్టం, కోరుతున్న పరిహారానికి సంబంధించిన పత్రాలు జతచేసి ఆర్బీఐ నిర్వహణ పోర్టల్‌ ఛిఝట.టఛజీ.ౌటజ.జీుఽ లో లాగిన్‌ అయి ఫిర్యాదు చేయవచ్చు. నిర్దేశిత ఫార్మాట్‌ ప్రకారం పోస్ట్‌ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని అధికారులు తెలిపారు.

Updated Date - 2023-09-22T02:47:01+05:30 IST