వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఒకరి మృతి
ABN , First Publish Date - 2023-03-19T00:17:58+05:30 IST
నల్లగొండ జిల్లాలో శనివారం జ రిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఓ యువతి మృతి చెందగా ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. కేతేపల్లి మం డలం చీకటిగూడెం గ్రామ సమీపం లో విద్యార్థిని మృతిచెందగా, మర్రిగూడ మండలం ఎరగండ్లపల్లి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం లో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఒకరి మృతి
ముగ్గురి పరిస్థితి విషయం
నలుగురికి తీవ్రగాయాలు
నకిరేకల్, మర్రిగూడ, మార్చి 18: నల్లగొండ జిల్లాలో శనివారం జ రిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఓ యువతి మృతి చెందగా ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. కేతేపల్లి మం డలం చీకటిగూడెం గ్రామ సమీపం లో విద్యార్థిని మృతిచెందగా, మర్రిగూడ మండలం ఎరగండ్లపల్లి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం లో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
గుర్తు తెలియని వాహనం కారును వెనుక నుంచి ఢీ కొట్టడంతో కారు పల్టీ కొట్టి విద్యార్థిని మృతి చెందింది. కేతేపల్లి మండలంలోని చీకటిగూడెం గ్రామ సమీపంలో 65వ జాతీయ రహదారిపై చోటు చే సుకుంది. ఏఎ్‌సఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్‌లోని మాదాపూర్‌కు చెందిన చేకూరి సరిత, దీవీ పద్మావతి, దీవీ విశ్వవిక్యాత, కరుణప్రీ తి కారులో పెళ్లి విజయవాడ వెళ్లి తిరిగి హైదరాబాద్‌కు తరలి వెళ్తుండగా కేతేపల్లి మండలం చీకటిగూడెం గ్రామ సమీపంలోకి రాగానే వెనుక నుంచి అతివేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం కారును ఢీకొట్టడంతో కారు పల్టీ కొట్టింది. అందులో ప్రయాణిస్తున్న కరుణ ప్రీతి (21) అనే విద్యార్థినికి తలకు బలమైన గాయమవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కారు లో చేకూరి సరిత, దీవీ పద్మావతి, దీవీ విశ్వవిఖ్యాత, డ్రైవర్ దొప్పలపూడి శ్రేయాష్ కు తీవ్ర గాయాలవడంతో వారిని చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. కరుణ ప్రీతి ఇటీవలే పె ళ్లి కోసం యూఎస్ నుంచి వచ్చినట్లు ఏఎ్‌సఐ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహా న్ని నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తునట్లు ఏఎ్‌సఐ తెలిపారు.
రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని...
ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ముగ్గురి పరిస్థితి విషమం గా మారింది. మర్రిగూడ మండలం ఎరగండ్లపల్లి గ్రామ సమీపంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, స్టేషన హెడ్‌కానిస్టేబుల్ శంకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.... ఎరగండ్లపల్లి గ్రామం నుంచి వల్లంల ముత్తయ్య అతని భార్య వల్లంల ముత్తమ్మ మర్రిగూడ వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. అదే గ్రామానికి చెందిన కొత్త రాజు, శివ ద్విచక్ర వాహనంపై మర్రిగూడ నుంచి ఎరగండ్లపల్లికి వెళ్తుండగా ఎరగండ్లపల్లి మార్గమధ్యంలో పూరేనాగుట్ట సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ద్విచక్ర వాహనంపై వస్తున్న వల్లంల ముత్తయ్య తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. అతని భార్య ముత్తమ్మకు నడుము, కాలు విరిగి తీవ్రంగా గాయాలయ్యాయి. ఎరగండ్లపల్లికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కొత్త శివ తలకు తీవ్రంగా గాయాలయ్యాయని హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు. నలుగురిలో ముగ్గురికి తీవ్రంగా గాయాలవడంతో వారిని చికిత్స నిమిత్తం మాల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వల్లంల ముత్త య్య, ముత్తమ్మను, కొత్త శివను పరీక్షించిన వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. ఈ ప్రమాదంపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని హెడ్‌కానిస్టేబుల్ శంకర్‌రెడ్డి తెలిపారు.