వచ్చేనెల 10న కాంగ్రెస్ బీసీ గర్జన
ABN , First Publish Date - 2023-09-22T03:01:58+05:30 IST
తెలంగాణలో వచ్చేనెల 10న కాంగ్రెస్ బీసీ గర్జన సభను నిర్వహించనున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు(వీహెచ్) వెల్లడించారు.
ముఖ్యఅతిథిగా సిద్ధరామయ్య: వీహెచ్
న్యూఢిల్లీ/హైదరాబాద్, సెప్టెంబర్ 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో వచ్చేనెల 10న కాంగ్రెస్ బీసీ గర్జన సభను నిర్వహించనున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు(వీహెచ్) వెల్లడించారు. షాద్‌నగర్‌లో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను వీహెచ్ గురువారం నాడు ఢిల్ల్లీలో కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలోనే కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటించనుంది. తెలంగాణ భవన్‌లో వీహెచ్ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ సభకు సిద్ధరామయ్య ముఖ్యఅతిథిగా హాజరవుతాయని వెల్లడించారు. బీసీలకు బీజేపీ అన్యాయం చేస్తోందని, రాజ్యాధికారంలో బీసీలకు భాగస్వామ్యం ఉండాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమని ఆయన తెలిపారు. బీసీ గర్జనను విజయవంతం చేయాలని బీసీలకు పిలుపునిచ్చారు. బీసీలకు 34 అసెంబ్లీ స్థానాలు ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారని, ఇంకా ఎక్కువ సీట్లు కేటాయించాలా అనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని వీహెచ్ తెలిపారు.