Share News

శీతాకాల విడిదికి నేడే హైదరాబాద్‌కు ముర్ము

ABN , Publish Date - Dec 18 , 2023 | 03:49 AM

శీతాకాల విడిదికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ప్రత్యేక విమానంలో ఆమె సోమవారం సాయంత్రం హకీంపేట్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌కు చేరుకొని రోడ్డు మార్గం ద్వారా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్తారు.

శీతాకాల విడిదికి  నేడే హైదరాబాద్‌కు ముర్ము

అల్వాల్‌, డిసెంబర్‌ 17 (ఆంధ్రజ్యోతి): శీతాకాల విడిదికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ప్రత్యేక విమానంలో ఆమె సోమవారం సాయంత్రం హకీంపేట్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌కు చేరుకొని రోడ్డు మార్గం ద్వారా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్తారు. అక్కడ త్రివిధ దళాల అధికారులు, రాష్ట్ర సీఎం, గవర్నర్‌, డీజీపీ, మేడ్చల్‌ ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌లు రాష్ట్రపతికి స్వాగతం పలుకుతారు. ముర్ము రాష్ట్రంలో రాకపోకలు సాగించేందుకు 1ఈఎంఈ గ్రౌండ్‌లో ప్రత్యేక హెలీప్యాడ్‌ ఏర్పాటు చేశారు.

ముర్ము షెడ్యూల్‌: 18వ తేదీ సాయంత్రం ముర్ము బొల్లారం రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. 19వ తేదీ మధ్యాహ్నం 12.50 గం.లకు బేగంపేట్‌ పబ్లిక్‌ స్కూల్‌లో నిర్వహించే కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు. ప్రత్యేక హెలీప్యాడ్‌ ద్వారా 20వ తేదీ ఉదయం 10 గం.లకు భూదాన్‌ పోంచంపల్లికి చేరుకొని అక్కడి చేనేత కార్మికులతో సమావేశమవనున్నారు. అనంతరం తిరిగి రాష్ట్రపతి నిలయానికి వస్తారు. 21, 22 తేదీల్లో రాష్ట్రపతి నిలయంలో నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు వీఐపీలను కలుస్తారు. 23వ తేదీ ఉదయం 10.30 గంటలకు ముర్ము రాజస్థాన్‌లోని జైపూర్‌ బయలుదేరుతారు.

Updated Date - Dec 18 , 2023 | 03:49 AM