గుండెపోటుతో ఒడిశా కార్మికుడు మృతి

ABN , First Publish Date - 2023-06-07T00:36:10+05:30 IST

బతుకుదెరువు కోసం ఇటుక బట్టీలో పని చేయడానికి వచ్చిన ఒడిశా కార్మికుడు గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని ఇందుగుల గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.

 గుండెపోటుతో ఒడిశా కార్మికుడు మృతి

గుండెపోటుతో ఒడిశా కార్మికుడు మృతి

మాడ్గులపల్లి, జూన 6: బతుకుదెరువు కోసం ఇటుక బట్టీలో పని చేయడానికి వచ్చిన ఒడిశా కార్మికుడు గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని ఇందుగుల గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఒడిశా రాష్ట్రం నువపాడ జిల్లా రూరైడ్‌ గ్రామానికి చెందిన మదనమాజి (55) ఇందుగుల గ్రామ శివారులోని రాయరపు మహదేవయ్య ఇటుక బట్టీలో పని చేసేందుకు ఐదు నెలల క్రితం కుటుంబసభ్యులతో కలిసి ఇక్కడికి వ చ్చాడు. రోజు మాదిరిగా బట్టీలో పనికి వెళ్లిన మదనమాజి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చాడు. నీరసంగా ఉందని నిమ్మరసం కలిపి ఇవ్వమని భార్యకు చెప్పాడు. నిమ్మరసం తాగే క్రమంలో ఛాతిలో నొప్పి వస్తుందని మదనమాజి అకస్మాత్తుగా అక్కడే కిందపడ్డాడు. భార్య బట్టీ యజమానికి సమాచారం ఇవ్వడంతో వెంటనే మదనమాజిని మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలియజేయడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యా రు. మృతుడు మదనమాజికి భార్య, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య పనమాజి ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-06-07T00:36:10+05:30 IST