రేషన షాపుల్లో ఫోర్టిఫైడ్‌ బియ్యం పరిశీలన

ABN , First Publish Date - 2023-08-15T00:32:07+05:30 IST

మండలంలోని నార్కట్‌ప ల్లి, గోపలాయిపల్లిలో గల రేషనషాపులను భారత ఆహార సంస్థకు చెందిన కేంద్ర అధికారుల బృందం సోమవారం ఆ కస్మిక తనిఖీ చేసింది.

రేషన షాపుల్లో ఫోర్టిఫైడ్‌ బియ్యం పరిశీలన
గోపలాయపల్లిలో రేషన దుకాణం తనిఖీ చేసి వివరాలు నమోదు చేస్తున్న బృందం

రేషన షాపుల్లో ఫోర్టిఫైడ్‌ బియ్యం పరిశీలన

నార్కట్‌పల్లి, ఆగస్టు 14: మండలంలోని నార్కట్‌ప ల్లి, గోపలాయిపల్లిలో గల రేషనషాపులను భారత ఆహార సంస్థకు చెందిన కేంద్ర అధికారుల బృందం సోమవారం ఆ కస్మిక తనిఖీ చేసింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కేంద్రప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన బియ్యంలో ఫోర్టిఫైడ్‌ చే సిన బియ్యాన్ని కలిపి ఇవ్వాల్సి ఉంది. అయితే ఆ ప్రకారం బియ్యం పంపిణీ చేస్తున్నా రా? లేక పాత పద్ధతిలోనే బియ్యాన్ని అందజేస్తున్నారా? అనే విషయాలపై బృంద స భ్యులు క్షేత్రస్థాయి సందర్శనతో ఆరా తీశారు. ఇప్పటికే డీలర్ల వద్దకు చేరిన బియ్యం నిల్వల బస్తాల నుంచి నమూనా సేకరించి ఫోర్టిఫైడ్‌ కలిపిన శాతాన్ని పరిశీలించారు. ఆ బియ్యం ఏ సంవత్సరానికి చెందినవో బస్తాలను తనిఖీ చేశారు. కేంద్ర బృందం వెం ట పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ చోప్రా, ఆర్‌ఐ తరుణ్‌ ఉన్నారు.

Updated Date - 2023-08-15T00:32:07+05:30 IST