గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం : చిరుమర్తి

ABN , First Publish Date - 2023-08-22T01:22:48+05:30 IST

గ్రామీ ణ ప్రాంతాలను అభివృద్థి చేయడమే తన లక్ష్యమని, గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి, సీఎం కేసీఆర్‌ అం దించిన సంక్షేమ పథకాలను చూసి బీఆర్‌ఎస్‌ పార్టీ కారు గుర్తుకు అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కోరారు.

 గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం : చిరుమర్తి
కలిమెరలో సబ్‌స్టేషన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే లింగయ్య

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం : చిరుమర్తి

కట్టంగూరు, చిట్యాలరూరల్‌, నకిరేకల్‌, ఆగస్టు 21: గ్రామీ ణ ప్రాంతాలను అభివృద్థి చేయడమే తన లక్ష్యమని, గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి, సీఎం కేసీఆర్‌ అం దించిన సంక్షేమ పథకాలను చూసి బీఆర్‌ఎస్‌ పార్టీ కారు గుర్తుకు అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహకారంతో నకిరేకల్‌ను మోడల్‌ ని యోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. నియోజకవర్గంలోని కట్టంగూ రు, చిట్యాల, నకిరేకల్‌ మండలాల్లో సోమవారం నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు.

కట్టంగూరు మండలంలోని దుగినెళ్లి గ్రామంలో రూ.10 లక్షల తో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామాని కి చెందిన వివిధ పార్టీలకు చెందిన 50 కుటుంబాలు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరాయి. అనంతరం కలిమెర గ్రామంలో రూ.3 కోట్లతో నిర్మించనున్న 33/11కేవీ విద్యుత ఉపకేంద్రానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు.

చిట్యాల మండలంలోని వట్టిమర్తికి వచ్చిన ఎమ్మెల్యే చిరుమర్తి కి నాయకులు, కార్యకర్తలకు ఘనంగా స్వాగతం పలికి భుజాన ఎ త్తుకుని అభినందనలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళలు మం గళహారతులను పట్టి స్వాగతం పలికారు. స్టేజీ వద్ద రూ.6 లక్షలతో నిర్మించిన బస్‌షెల్టర్‌ను ప్రారంభించారు. రహదారి నుంచి వట్టిమర్తి మీదుగా వనిపాకల వరకు బీటీ రోడ్డు పనులకు, ఆరోగ్య ఉపకేంద్రం నిర్మాణ పనులకు, సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చే శారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేశారు.

అంగనవాడీలకు ఎక్కువ వేతనం ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్‌ క్యాంపు కార్యాలయంలో అంగనవాడీ టీచర్లకు ప్రీస్కూల్‌ కిట్లను పంపిణీ చేసి మాట్లాడారు. మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం అమలు చేస్తున్న ఆ రోగ్యలక్ష్మి పథకం అమలుతీరును నీతి అయోగ్‌ ప్రశంసించినట్లు గు ర్తు చేశారు. అనంతరం నకిరేకల్‌ పట్టణ కేంద్రంలో రూ.26 కోట్ల వ్య యంతో జరుగుతున్న రోడ్డు వెడల్పు పనులను ఎమ్మెల్యే లింగయ్య పరిశీలించారు. నాణ్యతతో కూడిన పనులను వేగంగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో ఎం పీపీ జెల్లా ముత్తిలింగం, జడ్పీటీసీ తరాల బలరాం, తహసీల్దార్‌ స్వప్న, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన పోగుల నర్సింహ, వైస్‌ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, నకిరేకల్‌ మునిసిపల్‌ చైర్మన రాచకొండ శ్రీనివా్‌సగౌడ్‌, జడ్పీటీసీ మాద ధనలక్ష్మి, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, అంగనవాడీలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-22T01:22:48+05:30 IST