ఎంటెక్, ఎం ఫార్మసి ప్రవేశాలకు నోటిఫికేషన్
ABN , First Publish Date - 2023-09-22T03:27:21+05:30 IST
స్పాన్సర్డ్ కేటగిరీలో ఎంటెక్, ఎం ఫార్మసి కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి జేఎన్‌టీయూ హైదరాబాద్ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది.
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): స్పాన్సర్డ్ కేటగిరీలో ఎంటెక్, ఎం ఫార్మసి కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి జేఎన్‌టీయూ హైదరాబాద్ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సీట్ల భర్తీకి సంబంధించిన కౌన్సెలింగ్ అక్టోబరు 4, 5, 6 తేదీల్లో జరగనుంది. అర్హులైన అభ్యర్థులు వర్సిటీలో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరవ్వాలి. కోర్సులు, అర్హత, ఫీజులు ఇతర వివరాలకు జేఎన్‌టీయూ వెబ్‌సైట్‌ను సందర్శించాలని రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ సూచించారు. స్పాన్సర్డ్ కేటగిరీలో సీటు పొందిన వారికి స్కాలర్‌షిప్, హాస్టల్ సదుపాయాలు ఉండవని పేర్కొన్నారు.