నీతి ఆయోగ్ భేటీలో పాల్గొనకపోవడం సరికాదు: ఎఫ్‌జీజీ
ABN , First Publish Date - 2023-05-27T03:45:17+05:30 IST
నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనకూడదని సీఎం కేసీఆర్ నిర్ణయించడం సరికాదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(ఎఫ్‌జీజీ) అభిప్రాయపడింది.

నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనకూడదని సీఎం కేసీఆర్ నిర్ణయించడం సరికాదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(ఎఫ్‌జీజీ) అభిప్రాయపడింది. చాలాకాలంగా నీతి ఆయోగ్ సమావేశాలకు హాజరుకాకుండా రాష్ట్ర హితాన్ని కేసీఆర్ పణంగా పెడుతున్నారని ఆరోపించింది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి తప్పకుండా సమావేశానికి హాజరు కావాలని ఎఫ్‌జీజీ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి శుక్రవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.