గుగూల్‌ సెర్చ్‌లో దొరికిందే కాదు మీ జీవిత ఉదాహరణలు చెప్పండి

ABN , First Publish Date - 2023-06-26T02:25:50+05:30 IST

‘‘ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిలా ఉండాలి. గుగూల్‌ సెర్చ్‌లో అతి సులభంగా లభించిన అంశాన్నే విద్యార్థులకు బోధిస్తే ఉపయోగం లేదు. దానికి బదులు తమ సొంత అనుభవ పాఠాలను

గుగూల్‌ సెర్చ్‌లో దొరికిందే  కాదు  మీ జీవిత ఉదాహరణలు చెప్పండి

8 పద్మశ్రీ గ్రహీత, గణిత విద్యావేత్త ఆనంద్‌ కుమార్‌

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ‘‘ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిలా ఉండాలి. గుగూల్‌ సెర్చ్‌లో అతి సులభంగా లభించిన అంశాన్నే విద్యార్థులకు బోధిస్తే ఉపయోగం లేదు. దానికి బదులు తమ సొంత అనుభవ పాఠాలను తెలిపితేనే వారు మరింతగా నేర్చుకోవడానికి అవకాశముంటుంది. టెక్నాలజీ పరంగా ఇప్పటి పిల్లలు టీచర్ల కంటే కూడా ముందున్నారు’’ అని గణిత విద్యావేత్త ఆనంద్‌కుమార్‌ తెలిపారు. జేఈఈ పరీక్షలో మంచి ర్యాంకులు సాధించేందుకు సూపర్‌ 30 ప్రోగ్రా మ్‌ ద్వారా నిరుపేద విద్యార్థులకు తర్ఫీదునిసున్న ఆనంద్‌, శనివారం రాత్రి మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌(ఫ్లో) హైదరాబాద్‌ చాఫ్టర్‌ నిర్వహించిన ఓ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి విద్యకు ఉందని, విద్యే భవిష్యత్‌కు చక్కటి పునాది అని అన్నారు. లక్ష్యాన్ని సాధించే క్రమంలో మన ప్రయత్నాలు విఫలమైనా సానుకూల ధృక్పథం మాత్రం కోల్పోకూడదని, పట్టుదల ముఖ్యమని, అది లేకపోతే జీవితంలో విజయం సాధించడం అసాధ్యమని ఆయన అన్నారు. విజయానికి షార్ట్‌ కట్స్‌ ఉండవని, కష్టానికి ప్రత్యామ్నాయం ఉండదని పేర్కొన్నారు. ఈ సదస్సులో ఫ్లో హైదరాబాద్‌ చైౖర్‌పర్సన్‌ రీతు షాతో పాటుగా దాదాపు 300 మంది ఫ్లో సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T02:25:50+05:30 IST