ఏదీ బంగారు తెలంగాణ?

ABN , First Publish Date - 2023-06-02T02:30:15+05:30 IST

‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సీఎంగా ఉన్న కేసీఆర్‌ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానన్నారు.. కానీ ఇప్పటి వరకు ఏమీ చేయలేదు.

ఏదీ బంగారు తెలంగాణ?

బాగుపడింది కేసీఆర్‌ కుటుంబమే: షర్మిల

మంగళ్‌హాట్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సీఎంగా ఉన్న కేసీఆర్‌ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానన్నారు.. కానీ ఇప్పటి వరకు ఏమీ చేయలేదు. రాష్ట్రంలో కేవలం కేసీఆర్‌ కుటుంబమే బాగుపడింది’’ అని వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. తెలంగాణ ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తైన సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి నాంపల్లిలోని గన్‌పార్క్‌ అమరుల స్తూపం వద్ద ఆమె నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. కేసీఆర్‌ మిగులు బడ్జెట్‌గా ఉన్న రాష్ట్రాన్ని ఐదు లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. 9 సంవత్సరాల్లో 9 వేల మంది రైతులు, వందలాది మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీతో కేసీఆర్‌ డ్యూయెట్లు పాడితే... కాంగ్రెస్‌ మాత్రం కేసీఆర్‌కు సరఫరా కంపెనీగా మారిందని వ్యాఖ్యానించారు. వైఎ్‌సఆర్‌టీపీని ఏ పార్టీలో విలీనం చేయడం లేదని, సొంతంగానే అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దింపుతామని ఆమె చెప్పారు.

Updated Date - 2023-06-02T02:30:15+05:30 IST