న్యూ ఇయర్‌ జోష్‌

ABN , First Publish Date - 2023-01-01T00:14:12+05:30 IST

ప్రపంచంలో వెలకట్టలేనిదంటూ ఏదైనా ఉందంటే అది ఒక్క సమయం మాత్రమే. కళ్లు తెరిచి, మూసే లోపు రోజు లు గడిచిపోతున్నాయి. ఆ కాలచక్రంలో 2022వ సంవత్సరం చేరిపోయింది. ఎన్నో తీపి, చేదు గుర్తులను మన కు వదిలి వెళ్లిపోయింది. లేత భానుడి కిరణంలా ఆనందోత్సాహాలతో నూతనోత్తేజం నింపేందుకు 2023 సంవత్స రం మన ముంగిట నిలిచింది.

న్యూ ఇయర్‌ జోష్‌

భూదాన్‌పోచంపల్లి, నల్లగొండ కల్చరల్‌: ప్రపంచంలో వెలకట్టలేనిదంటూ ఏదైనా ఉందంటే అది ఒక్క సమయం మాత్రమే. కళ్లు తెరిచి, మూసే లోపు రోజు లు గడిచిపోతున్నాయి. ఆ కాలచక్రంలో 2022వ సంవత్సరం చేరిపోయింది. ఎన్నో తీపి, చేదు గుర్తులను మన కు వదిలి వెళ్లిపోయింది. లేత భానుడి కిరణంలా ఆనందోత్సాహాలతో నూతనోత్తేజం నింపేందుకు 2023 సంవత్స రం మన ముంగిట నిలిచింది. పాత సంవత్సరానికి వీడ్కో లు చెబుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు శనివారం అర్ధరాత్రి 12 గంటలకు నూతన సంవత్సరాన్ని ఆహ్వానించారు.

2022వ సంవత్సరం.. కాలగర్భంలో కలిసిపోయి కొత్త ఆశలను రేకెత్తిస్తూ 2023వ సంవత్సరం ఆరంభమైంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం నుంచే నూతన సంవత్సర వేడుకల సందడి మొదలైంది. అర్ధరాత్రి దాటేవరకూ హంగామా కొనసాగింది. ముఖ్యంగా మందు, విందు పార్టీలు జరుపుకునే యువత వేడుకలు శృతి మించకుండా పోలీసులు పలు ఆంక్షలు విధించారు. మహిళలు, యువతులు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ముగ్గులేయడంలో మునిగితేలుతున్నారు. ఇందుకోసం మార్కెట్‌లో లభించే రంగుల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. బేకరీ నిర్వాహకులు నోరూరించే కేక్‌లు తయారు చేసి అమ్మకానికి పెట్టారు. రూ.100నుంచి ఆపైన రకరకాల కేకులు విక్రయించారు. నూతన సంవత్సరం వేడుకలకు మద్యం దుకాణాలు, బార్లు పెద్దఎత్తున మద్యం స్టాక్‌ పెట్టుకున్నాయి. ఈ రెండు రోజుల్లో మాంసం అమ్మకాలు సైతం భారీగానే జరుగుతున్నాయి. చికె న్‌ సెంటర్లు, మటన్‌షాపులు, చేపల వ్యాపారులకు అందుకనుగుణంగా తమ ఏర్పాట్లు చేసుకున్నారు. మార్కెట్లో గ్రీటింగ్‌ కార్డులు కొనేవారు కరువయ్యారు. కార్డులకు కాలం చెల్లిన నేపథ్యంలో.. ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమాలను ఎంచుకున్నారు. అర్ధరాత్రి నుంచే ‘ఆన్‌లైన్‌’లో శుభాకాంక్షలు సందడి మొదలైంది.

చెడును వదిలి.. మంచిని స్వీకరించాలి

పల్లె, పట్నం తేడా లేకుండా న్యూ ఇయర్‌ వేడుకలకు కుర్రకారు రెడీ అయ్యారు. కొత్త సంవత్సరంలో నూతనోత్తేజం పొందాలన్న ఆలోచనలో కొందరున్నారు. చెడును వదిలి మంచిని స్వీకరించాలని కొంద రు, మత్తుపానీయాలకు స్వస్తిపలకాలన్న ఆలోచనలో మరికొందరు..! ఇలా తమ సన్నిహితులతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సిద్ధపడుతున్నారు. గత సంవత్సరంలో కరోనా లాక్‌డౌన్‌తో అతలాకుతలమైన ప్రజలకు ఈ ఏడాదిలోనైనా తమ జీవితంలో అంతా మంచే జరుగాలని, పట్టిందల్లా బంగారమై దశ తిరగాలనే ఆశతో దేవాలయాల్లో ప్రత్యేకపూజలు చేసేందుకు సిద్ధపడుతున్నారు. కొత్త సంవత్సరం శుభాకాంక్షలను వినూత్నంగా తెలిపేందుకు యువత సిద్ధ పడుతోంది. దీంతో బాణాసంచా, న్యూ ఇయర్‌ కేకులకు గిరాకీ పెరుగుతుంది.

నల్లగొండ జిల్లా కేంద్రంలో..

నల్లగొండ జిల్లాకేంద్రంలోని వివిధ పార్టీ కార్యాలయాల్లో, అధికారు ల బంగ్లాలు, ఇళ్ళల్లో న్యూఇయర్‌ వేడుకలు అంబరాన్నంటాయి. యువకులు ద్విచక్ర వాహనాల మీద పట్టణంలో తిరుగుతూ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్‌ అంటూ స్నేహితులను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపి సరదాగా గడిపారు. కలెక్టర్‌ బంగ్లాలో కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు, ఇతర రెవెన్యూ అధికారులు, ఎస్పీ బంగ్లాలో ఎస్పీ రెమారాజేశఽ్వరి తన కుటుంబ సభ్యులతో, పోలీసు అధికారులతో న్యూ ఇయర్‌ వేడుకలను ఘనంగా జరిపారు. కేకులను కట్‌చేసి స్వీట్లను పంచుకొని ఆట పాటతో గడిపారు. నల్లగొండ ఎమ్యెల్యే కంచర్లభూపాల్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయంతోపాటు వివిధ పార్టీలకు చెందిన రాజకీ య నాయకుల ఇళ్ళల్లో తమ కార్యకర్తలతో న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. అదేవిధంగా పట్టణంలోని క్లాక్‌టవర్‌ సెంటర్‌లోగల స్వపోషణ తెలుగు బాప్టిస్టు చర్చిలో ఫాదర్‌ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌చేసి క్యాండిల్స్‌ వెలిగించి న్యూఇయర్‌ వేడుకలు జరిపారు. భక్తులు ప్రత్యేక ప్రార్థనలుచేశారు. అదేవిధంగా మిష న్‌ కాంపౌండ్‌లోని సెంటినరీ బాప్టిస్ట్‌ చర్చిలో కూడా వేడుకలు జరిగాయి. దేవరకొండ రోడ్‌లోని మరియరాణి కేథడ్రల్‌ చర్చిలో విచారణ ఫాదర్‌ ఆధ్వర్యంలో, వివిధ రంగులతో ముగ్గులు వేశారు. అపార్ట్‌మెం ట్లు, కాలనీల్లో ప్రత్యేకంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మద్యం దుకాణాలు, రెస్టారెంట్లు మధ్య రాత్రి వరకు అనుమతించటంతో అవన్నీ సందడిగా మారాయి. అమ్మకాలు ముమ్మరంగా సాగాయి. మందు ప్రియులకు, రెస్టారెంట్లు, బార్లు తెరిచి ఉండడంతో వారు తాగి తూగారు. అదే విధంగా మాంసం దుకాణాల్లో మాంసాన్ని ముమ్మరంగా కొనుగోలుచేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అన్ని ప్రాంతాల్లో ముమ్మరంగా గస్తీ తిరుగుతూ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణమంతా విద్యుత్‌ కాంతులతో విరాజిల్లుతూ కొత్త సంవత్సరానికి శోభనిచ్చే విధంగా స్వాగతం పలికింది. న్యూఇయర్‌ సందర్భంగా ఆదివారం పట్టణంలోని పలు దేవాలయాలు భక్తులతో సందడి చేయనున్నాయి.

నూతన సంవత్సర శుభాకాంక్షలు : జగదీష్‌రెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి

తెలంగాణ సమాజం సుభిక్షంగా ఉండాలనేదే సీఎం కేసీఆర్‌ సంకల్పం. అధికారంలోకి వచ్చిందే తడవుగా అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసి విజయవంతం అయ్యింది. తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన రోజున రూపొందించిన ఎజెండా 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి రాగానే అమలు పర్చిన ఘనత ముఖ్యమంత్రిది. నూతన సంవత్సరం సందర్భంగా ఉమ్మడి ప్రజలకు శుభాకాంక్షలు.

Updated Date - 2023-01-01T00:14:16+05:30 IST