ఇండియన్‌ నేషనల్‌ మ్యాథ్స్‌, సైన్స్‌ ఒలింపియాడ్స్‌లో నారాయణ స్కూల్స్‌ విజయదుందుభి!

ABN , First Publish Date - 2023-03-02T02:16:48+05:30 IST

హెచ్‌బీసీఎ్‌సఈ, భారత ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించే ఓరియంటేషన్‌ కమ్‌ సెలక్షన్‌ క్యాంప్‌, ఇంటర్నేషనల్‌ మ్యాథమెటికల్‌ ఒలింపియాడ్‌

ఇండియన్‌ నేషనల్‌ మ్యాథ్స్‌, సైన్స్‌ ఒలింపియాడ్స్‌లో నారాయణ స్కూల్స్‌ విజయదుందుభి!

హైదరాబాద్‌, మార్చి 1: హెచ్‌బీసీఎ్‌సఈ, భారత ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించే ఓరియంటేషన్‌ కమ్‌ సెలక్షన్‌ క్యాంప్‌, ఇంటర్నేషనల్‌ మ్యాథమెటికల్‌ ఒలింపియాడ్‌ ట్రైనింగ్‌ క్యాంప్‌నకు నారాయణ నుంచి అత్యధికంగా 33 మంది విద్యార్థులు సెలక్షన్స్‌ సాధించారు. దేశవ్యాప్తంగా జరిగిన ఈ పోటీలో మ్యాథ్స్‌ ఒలింపియాడ్‌కు 12 మంది, కెమిస్ర్టీ ఒలింపియాడ్‌కు 9 మంది, ఫిజిక్స్‌ ఒలింపియాడ్‌కు ఐదుగురు, సైన్స్‌ ఒలింపియాడ్‌కు ఏడుగురు తర్వాతి దశ అయిన ఓరియంటేషన్‌ క్యాంప్‌నకు అర్హతసాధించినట్లు నారాయణ విద్యా సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్లు పి.సింధూర నారాయణ, శరణి నారాయణ తెలిపారు. సైన్స్‌ ఒలింపియాడ్‌లో తెలంగాణ నుంచి ఓరియంటేషన్‌ కమ్‌ సెలక్షన్‌ క్యాంప్‌నకు ఒకే ఒక విద్యార్థి ఎంపిక కాగా ఆ ఒక్కరూ నారాయణ విద్యార్థి కావడం గమనార్హమన్నారు. సైన్స్‌ ఒలింపియాడ్‌లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఓరియంటేషన్‌ కమ్‌ సెలక్షన్‌ క్యాంప్‌నకు ఒకే ఒక విద్యార్థి సెలెక్టవగా ఆ ఒక్కరూ నారాయణ విద్యార్థి కావడం ఎంతో గర్వించదగిన విషయమని తెలిపారు. దక్షిణాదిలో నారాయణ స్కూల్స్‌ తప్ప మరే ఇతర స్కూల్‌ ఇంతటి అద్భుత విజయం సాధించలేదన్నారు.

Updated Date - 2023-03-02T02:16:48+05:30 IST