Share News

శ్రీరాముడిగా నారసింహుడు

ABN , Publish Date - Dec 26 , 2023 | 12:11 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో వార్షిక అధ్యయనోత్సవాలు మూడో రోజు సోమవారం పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో వైభవంగా కొనసాగాయి.

శ్రీరాముడిగా నారసింహుడు
శ్రీరామావతార అలంకారసేవ, ఆళ్వార్‌ సేవలు

శాస్త్రోక్తంగా యాదాద్రి వార్షిక అధ్యయనోత్సవాలు

50వేల మందికి పైగా తరలివచ్చిన భక్తులు

యాదగిరిగుట్ట, డిసెంబరు 25: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో వార్షిక అధ్యయనోత్సవాలు మూడో రోజు సోమవారం పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో వైభవంగా కొనసాగాయి. స్వామిని ఉదయం శ్రీరామచం ద్రమూర్తిగా.. రాత్రి వేళ తిరువేంకటనాథుడిగా దివ్యమనోహ రంగా అలంకరించిన ఆచార్యులు ఆలయ తిరువీధుల్లో దివ్య ప్రబంధ వేద పఠ నాల నడుమ సేవోత్సవం నిర్వహించారు. ముందుగా ప్రధానాలయ ప్రాకార మండపంలో హోమ పూజలతో ఉత్సవమూర్తులకు, ఆళ్వార్లకు స్నపన తిరు మంజనాలు నిర్వహించారు. స్వామిని దివ్యమనోహరంగా శ్రీరామావతార అలంకరణలో అలంకరించి వేద మంత్ర పఠనలు, మంగళవాయిద్యాల నడుమ సేవోత్సవం నిర్వహించారు. ఉత్సవమూర్తుల సేవకు ఎదురుగా ఆళ్వారుల సేవ కొనసాగగా రుత్వికబృందం, అర్చకస్వాములు, వేదపం డితులు దివ్యప్రబంధ పాఠనం జరిపారు. లోకకల్యాణం.. విశ్వశాంతి స్థాపనకు భూమిపై శ్రీరామ చంద్రమూర్తిగా అవతరించాడని, ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని అని లోకానికి చాటి చెప్పిన మహనీయ కల్యాణ గుణమూర్తి రామచం ద్రుడిని, శ్రీరామచంద్రమూర్తి పరమభక్తుడైన క్షేత్ర పాలకుడు ఆంజనేయుడి వాహన సేవలో యాదాచల నృసింహుడు భక్తులకు దర్శనమిచ్చి తరింప జేశాడని అర్చకులు అలంకారసేవ విశిష్టతను వివరించారు. రాత్రి వేళ తిరుమల తిరుపతి వేంకటనాథుడిగా స్వామిని దివ్యమనోహరంగా అలంకరించిన ఆచార్యులు దివ్యప్రబంధ వేదపఠనాలు, మం గళ వాయిద్యాల నడుమ ఆలయ తిరుమాఢవీధుల్లో ప్రత్యేక సేవలో విహరింపజేశారు. వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త బీ. నరసింహమూర్తి, ఈవో రామకృష్ణారావు పా ల్గొన్నారు. స్వామిని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గౌరవ సలహాదారు దేవులపల్లి అమర్‌ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు.

యాదగిరిగుట్టలో భక్తుల సందడి

వరుస సెలవులు ఉండడంతో యాదగిరిగుట్ట క్షేత్రానికి వివిధ ప్రాంతాల నుంచి కుటుంబసమేతంగా తరలి వచ్చిన భక్తులు ఇష్టదైవాలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ తిరువీధులు, సేవా మండపాలు, ఉభయ దర్శన క్యూలైన్లు, ఆలయ ఘాట్‌రోడ్లు, పట్టణ ప్రధాన రహదారులు భక్తులతో కిటకిటలాడాయి. భక్తుల హరిహరనా మస్మరణల నడుమ క్షేత్రం ఆధ్యాత్మికత నిండుకుంది. ధర్మదర్శనానికి నాలుగు గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. సుమారు 50వేల మందికి పైగా భక్తులు క్షేత్రాన్ని సందర్శించినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు. స్వామికి నిత్యారాధనలు, ఆండాళ్‌ అమ్మవారి తిరుప్పావై వైదిక పర్వాలు సంప్రదాయరీతిలో కొనసాగాయు.

యాదగిరీశుడి నిత్యాదాయం రూ.74.94లక్షలు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఖజానాకు సోమవారం వివిధ విభాగాల ద్వారా రూ.74,94,698 ఆదాయం సమకూరినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు. వీటిలో ప్రసాదాల విక్రయం ద్వారా రూ.30,03,200, వీఐపీ దర్శనాల ద్వారా రూ.15.75లక్షలు, వాహన ప్రవేశం ద్వారా రూ.9 లక్షలు, బ్రేక్‌ దర్శనాల్లో 2,610మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా రూ.7.83లక్షలు, ఇతర విభాగాల నుంచి మొత్తం రూ.74,94,698 ఆదాయం సమకూరినట్లు అధికారులు వివరించారు.

Updated Date - Dec 26 , 2023 | 12:12 AM