పోలీసుల అదుపులో జూదరులు

ABN , First Publish Date - 2023-05-18T00:49:49+05:30 IST

మండలంలోని అర్రూరు పరిధి మత్స్యగిరి గుట్ట సమీపం వద్ద కొందరు పేకాట అడుతుండగా ఐదుగురిని పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల అదుపులో జూదరులు

వలిగొండ, మే 17: మండలంలోని అర్రూరు పరిధి మత్స్యగిరి గుట్ట సమీపం వద్ద కొందరు పేకాట అడుతుండగా ఐదుగురిని పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌వోటీ పోలీసుల సహకారంతో దాడులు చేయగా పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.81,040, ప్లేయింగ్‌ కార్డు సెట్‌, ఐదు సెల్‌ఫోన్లు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రభాకర్‌ తెలిపారు.

Updated Date - 2023-05-18T00:49:49+05:30 IST