నకిరేకల్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా

ABN , First Publish Date - 2023-06-26T00:47:02+05:30 IST

నకిరేకల్‌ పట్టణాన్ని అన్ని విధాలుగా అ భివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్‌లోని తిప్పర్తి రోడ్డు మెయున సెంటర్‌ నుంచి చీమలగడ్డ ప్లైఓవర్‌ బ్రిడ్జి వరకు రూ.2.70 కోట్ల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆదివారం ఆయన శంకుస్థాప న చేశారు.

 నకిరేకల్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా
సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే లింగయ్య

నకిరేకల్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా

ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

నకిరేకల్‌, జూన 25: నకిరేకల్‌ పట్టణాన్ని అన్ని విధాలుగా అ భివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్‌లోని తిప్పర్తి రోడ్డు మెయున సెంటర్‌ నుంచి చీమలగడ్డ ప్లైఓవర్‌ బ్రిడ్జి వరకు రూ.2.70 కోట్ల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆదివారం ఆయన శంకుస్థాప న చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునిసిపాలిటీల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. పట్టణంలోని తిప్పర్తి రోడ్డులో సీసీ రోడ్డు పూర్తయితే ప్రయాణికులకు ఇ బ్బందులు తొలిగిపోతాయన్నారు. నకిరేకల్‌ పట్టణంలో ఇప్పటికే ప లు అభివృద్ధి పనులు చురుకుగా కొనసాగుతున్నాయన్నారు. అనంత రం పట్టణంలో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి పనులను ఆయ న పరిశీలించారు. సకాలంలో పనులు పూర్తయ్యే విధంగా చొరవ చూపాలని అధికారులకు సూచించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయంలో 12 మంది లబ్ధిదారులకు రూ.5.50 లక్షల విలు వైన సీఎం రిలీ్‌ఫ ఫండ్‌ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన రాచకొండ శ్రీనివా్‌సగౌడ్‌, జడ్పీటీసీ మాద ధనల క్ష్మి, మునిసిపల్‌ వైస్‌ చైర్మన మురారిశెట్టి ఉమారాణి, ఏఎంసీ చైర్మన కొప్పుల ప్రదీ్‌పరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన పల్‌రెడ్డి మహేందర్‌రెడ్డి, పలువురు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T00:47:02+05:30 IST