Share News

మల్కాజ్‌గిరి అభ్యర్థిగా ఎన్‌.రాంచందర్‌రావు

ABN , First Publish Date - 2023-11-10T04:37:10+05:30 IST

సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు బీజేపీ తరపున మల్కాజిగిరి నుంచి మరోసారి బరిలో దిగనున్నారు.

మల్కాజ్‌గిరి అభ్యర్థిగా ఎన్‌.రాంచందర్‌రావు

కంటోన్మెంట్‌లో మాజీ ఐపీఎస్‌ కృష్ణప్రసాద్‌

హైదరాబాద్‌, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు బీజేపీ తరపున మల్కాజిగిరి నుంచి మరోసారి బరిలో దిగనున్నారు. మాజీ ఐపీఎస్‌, పార్టీ అధికార ప్రతినిధి కృష్ణప్రసాద్‌కు కంటోన్మెంట్‌ సీటు ఇచ్చారు. పెద్దపల్లి టికెట్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీ్‌పకుమార్‌కు దక్కింది. ఇక్కడ టికెట్‌ ఆశించిన గుజ్జుల రామకృష్ణారెడ్డికి చుక్కెదురైంది. శేరిలింగంపల్లి సీటు రవికుమార్‌యాదవ్‌కు దక్కింది. సీనియర్‌ నేత యోగానంద్‌ చివరి వరకు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. కాగా, మేడ్చల్‌ సీటును సీనియర్‌ నేత విక్రంరెడ్డికి కేటాయించారు. వేములవాడలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనుంది. ఇక్కడ తుల ఉమకు టికెట్‌ కేటాయించగా, తీవ్ర ప్రయత్నం చేసిన వికా్‌సరావు కూడా నామినేషన్‌ దాఖలు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Updated Date - 2023-11-10T04:37:16+05:30 IST