బైపీసీ విద్యార్థులకు ఎంసెట్ కౌన్సెలింగ్
ABN , First Publish Date - 2023-09-05T03:53:34+05:30 IST
: బీ-ఫార్మసీ, ఫామ్-డీ, బయోమెడికల్, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకై బైపీసీ అభ్యర్థులకు నిర్వహించే ఎంసెట్ కౌన్సెలింగ్ సోమవారం ప్రారంభమైంది.
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు4(ఆంధ్రజ్యోతి): బీ-ఫార్మసీ, ఫామ్-డీ, బయోమెడికల్, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకై బైపీసీ అభ్యర్థులకు నిర్వహించే ఎంసెట్ కౌన్సెలింగ్ సోమవారం ప్రారంభమైంది. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన అభ్యర్థులు, ఈనెల 7లోగా వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకోవచ్చు. 11వ తేదీన సీట్లు కేటాయిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 17 వేల మంది అభ్యర్థులు తమ ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్స్ బుక్ చేసుకున్నారు. సోమవారం జేఎన్‌టీయూ హెల్ప్‌లైన్ కేంద్రానికి 560 మంది స్లాట్ బుక్ చేసుకోగా, జోరువానలోనూ వారంతా కౌన్సెలింగ్‌కు హాజరైనట్లు వర్సిటీ అడ్మిషన్ల విభాగం డిప్యూటీ డైరెక్టర్ ప్రొఫెసర్ రాంజీ తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రక్రియను ఈ నెల 6 వరకు పొడిగించినట్లు సమాచారం అందిందని ఆయన తెలిపారు.