ఎమ్మెల్సీ కవితతో సినీ నటుడు శరత్‌కుమార్ భేటీ
ABN , First Publish Date - 2023-01-29T02:51:40+05:30 IST
ఎమ్మెల్సీ కవితతో సినీ నటుడు, ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి అధ్యక్షుడు శరత్‌కుమార్ శనివారం భేటీ అయ్యారు.
హైదరాబాద్, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ కవితతో సినీ నటుడు, ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి అధ్యక్షుడు శరత్‌కుమార్ శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ స్థాపన, లక్ష్యాలు, అజెండా తదితర అంశాలను శరత్‌కుమార్ అడిగి తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో ఈ పార్టీతో పొత్తు పెట్టుకునే అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం.