ఆధునిక సేద్యం లాభదాయకం
ABN , First Publish Date - 2023-03-18T03:46:43+05:30 IST
ఆధునిక సేద్యం లాభదాయకమని, చీడపీడల నివారణలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి రాజు కోరారు.

తలకొండపల్లి, మార్చి17: ఆధునిక సేద్యం లాభదాయకమని, చీడపీడల నివారణలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి రాజు కోరారు. తలకొండపల్లి మండలం చంద్రధన, పూల్‌సింగ్ తండాలలో శుక్రవారం ఏవో పర్యటించారు. ఈసందర్భంగా గ్రామంలో పలువురు రైతులు సాగు చేసిన వేరుశనగ, మొక్కజొన్న పంటలను పరిశీలించి చీడ పీడల నివారణ గురించి అవగాహన కల్పించారు. రైతులు సాగులో పెట్టుబడులు తగ్గించుకొని దిగుబడులు పెంచుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో నిఖిత, రైతులు శ్రీను, చంద్రు, తదితరులు పాల్గొన్నారు.