Share News

కమ్మేసిన పొగమంచు

ABN , Publish Date - Dec 24 , 2023 | 11:08 PM

వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. దీనికి తోడు పల్లెలు, పట్టణాలను మంచు దుప్పటి కమ్మేస్తోంది. ఆదివారం ఉదయం తొమ్మిది గంటల వరకు కూడా మంచుకప్పి ఉండడంతో జనం బయటకు రావడానికి ఇబ్బందులు పడ్డారు.

 కమ్మేసిన  పొగమంచు
బొంరా్‌సపేట్‌లో ఆకాశంలో కమ్ముకున్న మంచు మబ్బులు

ఇబ్బందులు పడుతున్న ప్రజలు

లైట్లు వేసుకుని వాహనదారుల ప్రయాణాలు

వికారాబాద్‌/ బొంరా్‌సపేట/ పరిగి/ ఘట్‌కేసర్‌,డిసెంబరు 24: వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. దీనికి తోడు పల్లెలు, పట్టణాలను మంచు దుప్పటి కమ్మేస్తోంది. ఆదివారం ఉదయం తొమ్మిది గంటల వరకు కూడా మంచుకప్పి ఉండడంతో జనం బయటకు రావడానికి ఇబ్బందులు పడ్డారు. వాహనదారులు కూడా ఎనిమిది గంటల వరకు కూడా లైట్లు వేసుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు. వికారాబాద్‌, బొంరా్‌సపేట, పరిగి, ఘట్‌కేసర్‌ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలముకుంది.

Updated Date - Dec 24 , 2023 | 11:08 PM