నేడు మిర్యాలగూడకు మంత్రుల రాక

ABN , First Publish Date - 2023-05-26T01:11:10+05:30 IST

మిర్యాలగూడ నియోజకవర్గంలో మంత్రులు హరీశ్‌రావు, జగదీ్‌షరెడ్డిలు శుక్రవారం పర్యటించనున్నారు. ఉదయం 10గంటలకు వేములపల్లి మండలకేంద్రంలో రూ.20 లక్షలతో నిర్మించి న గ్రామపంచాయితీ భవన ప్రారంభోత్సవం, 10:15గంటలకు మిర్యాలగూడ మునిసిపాలిటీ 6వ వార్డు ఇందిరమ్మకాలనీలో బస్తీ దవాఖానా ప్రారంభోత్సవం, ఏరియా ఆసుపత్రిలో రూ. 14 కోట్లతో నిర్మించనున్న నూతన భవనానికి శంకుస్థాపన చేస్తారు.

నేడు మిర్యాలగూడకు  మంత్రుల రాక

మిర్యాలగూడ, మే 25: మిర్యాలగూడ నియోజకవర్గంలో మంత్రులు హరీశ్‌రావు, జగదీ్‌షరెడ్డిలు శుక్రవారం పర్యటించనున్నారు. ఉదయం 10గంటలకు వేములపల్లి మండలకేంద్రంలో రూ.20 లక్షలతో నిర్మించి న గ్రామపంచాయితీ భవన ప్రారంభోత్సవం, 10:15గంటలకు మిర్యాలగూడ మునిసిపాలిటీ 6వ వార్డు ఇందిరమ్మకాలనీలో బస్తీ దవాఖానా ప్రారంభోత్సవం, ఏరియా ఆసుపత్రిలో రూ. 14 కోట్లతో నిర్మించనున్న నూతన భవనానికి శంకుస్థాపన చేస్తారు. 11 గంటలకు నియోజకవర్గంలో రూ.5.60 కోట్లతో నిర్మించే 28 నూతన పీహెచ్‌సీ సబ్‌సెంటర్ల నిర్మాణానికి శంకుస్థాపన, అనంతరం ఎన్నెస్పీ క్యాంపు మైదానంలో పట్టణ బీఆర్‌ఎస్‌ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రులు పాల్గొంటారు.

Updated Date - 2023-05-26T01:11:10+05:30 IST