సాగర్‌లో మంత్రి రోజా సందడి

ABN , First Publish Date - 2023-04-10T23:55:11+05:30 IST

ఆంధ్రప్రదేశ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా సోమవారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీ విజయవిహార్‌ అతిథిగృహంలో కొద్దిసేపు ఆగారు.

సాగర్‌లో మంత్రి రోజా సందడి
స్థానికులతో సెల్ఫీదిగుతున్న రోజా

సాగర్‌లో మంత్రి రోజా సందడి

నాగార్జునసాగర్‌, ఏప్రిల్‌ 10: ఆంధ్రప్రదేశ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా సోమవారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీ విజయవిహార్‌ అతిథిగృహంలో కొద్దిసేపు ఆగారు. నాగార్జునసాగర్‌కు 20 కిలోమీటర్ల దూరం లో ఉన్న పల్నాడు జిల్లాలోని మాచర్లలో జరిగే చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించే ఎడ్ల పందేలను ప్రారంభించడానికి వెళ్తూ మార్గమధ్యలో సాగర్‌ విజయవిహార్‌ అతిథిగృహంలో ఆగారు. మధ్యాహ్నం వచ్చిన ఆమె కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం మంత్రి రోజా మాచర్లకు బయలుదేరి వెళ్లారు. ఆ సమయంలో రోజాను గుర్తించిన స్థానిక మహిళలు, యువకులు అధిక సెల్ఫీలు దిగారు. ఆమెకు స్వాగతం పలికిన వారిలో నందికొండ కౌన్సిలర్‌ రామకృష్ణ, మహిళలు నవ్య, శ్రీదేవి, శ్రావణి, అయ్యప్ప, అంజిబాబు, సత్యనారాయణ, తులసి, ప్రేమానంద్‌, వహిద్‌ ఉన్నారు.

Updated Date - 2023-04-10T23:55:11+05:30 IST