కేఎల్లాఆర్‌తో కాంగ్రెస్ నేతల భేటీ
ABN , First Publish Date - 2023-05-26T03:08:08+05:30 IST
ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అంతర్గత విభేదాల వల్ల పార్టీకి దూరమైన నేతలను తిరిగి రప్పించేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం నేరుగా రంగంలోకి దిగింది. రేవంత్‌రెడ్డికి పీసీసీ పగ్గాలు

ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అంతర్గత విభేదాల వల్ల పార్టీకి దూరమైన నేతలను తిరిగి రప్పించేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం నేరుగా రంగంలోకి దిగింది. రేవంత్‌రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రె్‌సకు రాజీనామా చేసిన మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి(కేఎల్లార్)ని తిరిగి పార్టీలోకి ఆహ్వానించి క్రియాశీలక బాధ్యతలు అప్పగించేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయించింది. ఈ మేరకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రేతో పాటు ఏఐసీసీ జాతీయ కార్యదర్శి రోహిత్ చౌదరి, ఏఐసీసీ నేత ప్రేమ్‌సాగర్‌రావు గురువారం కేఎల్లాఆర్‌ను రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. పార్టీలో ఇతర నేతలతో ఉన్న ఇబ్బందులను తొలగిస్తామని, ఇక నుంచి పార్టీలో క్రియాశీలకంగా పనిచేయాలని కేఎల్లార్‌ను నాయకులు కోరారు. దీనికి లక్ష్మారెడ్డి సైతం సానుకూలంగా స్పందించారు.